MahaKumbh 2025: సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఏ మూల ఏం జరిగినా కూడా అది క్షణాల్లోనే వైరల్ అయిపోతూ ఉంటుంది. అంతేకాకుండా సోషల్ మీడియా పుణ్యమా అంటూ కొందరు రాత్రికి రాత్రే స్టార్లుగా మారిపోయిన వారు కూడా ఉన్నారు. ఎంతోమందికి జీవితాన్ని కూడా ఇచ్చింది సోషల్ మీడియా. ఒక వ్యక్తిలో టాలెంట్ ఉంది అంటే చాలు ఆ వ్యక్తిని వైరల్ చేసే వరకు సోషల్ మీడియాలో కొంతమంది ఊరుకోరు. అలా తాజాగా కూడా ఒక అమ్మాయిని బాగా వైరల్ చేసేసారు. ఎక్కడో చిన్న ప్రదేశంలో ఉంటూ దండలు అమ్ముకునే ఆమెను కాస్త హీరోయిన్ అయ్యే అవకాశాన్ని కల్పించాలని చెప్పాలి.

ఇప్పటికే ఆమె ఎవరు అన్నది అర్థమై ఉంటుంది. కాటు దిద్దిన అందమైన తేనె కళ్లు, డస్కీ స్కీన్, సింపుల్ హెయిర్ స్టైల్ తో మహా కుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో దండలు అమ్ముకుంటున్న ఆ అమ్మాయి అందానికి ఫిదా అయిన కొందరు వెంటనే తన ఫోటోస్ నెట్టింట షేర్ చేయడంతో చాలా ఫేమస్ అయిపోయింది. కాగా ఆ అమ్మాయి పేరు మోనాలిసా. మధ్యప్రదేశ్ ఇండోర్ కు చెందిన ఆ అమ్మాయి కుంభమేళాలో దండలు అమ్ముకోవడానికి తన కుటుంబంతో కలిసి వచ్చింది. అయితే ఆమె తేనెకళ్లు చూడచక్కని రూపం చూసి ఫిదా అయిన కొందరు ఆ అమ్మాయి ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో చాలా పాపులర్ అయ్యింది.

ఇక ఇప్పుడు మోనాలిసా రూపం పూర్తిగా మారిపోయింది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆ అమ్మాయికి బాలీవుడ్ నుంచి మంచి ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్, యూత్ ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ ఎక్కడ చూసినా కూడా మోనాలిసాకు సంబంధించిన ఫోటోలు వీడియోలే వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే మీడియా వాళ్ళు కూడా ఆమెను ఇంటర్వ్యూ తీసుకున్న విషయం తెలిసిందే. మోనాలిసా విషయానికి వస్తే.. చిన్నప్పటి నుంచి దండలు అమ్ముతూ తన తల్లిదండ్రులకు సాయం చేస్తుంది. ఈ క్రమంలోనే కుంభమేళాలో తన కుటుంబంతో కలిసి దండలు విక్రయిస్తున్న ఆ అమ్మాయి నెట్టింట పాపులర్ కావడంతో ఇప్పుడు ఆమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా ఛాన్స్ ఇచ్చారట.
డైరెక్టర్ సనోజ్ మిశ్రా త్వరలోనే ఆ అమ్మాయిని కలవనున్నారని టాక్. ఈ సందర్భంగా సనోజ్ మిశ్రా మాట్లాడుతూ.. మోనాలిసా రూపం, ఆమె అమాయకత్వాన్ని చూసి తాను ఫిదా అయ్యాను. తనకు డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో ఛాన్స్ ఇవ్వాలనుకుటున్నాను. ఈ సినిమా కోసం ఇలాంటి అమ్మాయినే వెతుకుతున్నాను. ఇందులో రైతు కూతురి పాత్ర కోసం మోనాలిసా సెట్ అవుతుంది. త్వరలోనే ప్రయాగ్ రాజ్ వెళ్లి ఆమెను కలుస్తాను అని ఆయన చెప్పుకొచ్చారు.



























