Mother builds temple for son : ఏ తల్లి కైనా తన బిడ్డ అంటే ప్రేమ ఉంటుంది. ఈ సృష్టిలో ఏ జీవి అయినా తమ బిడ్డల కోసం తమ ప్రాణాలను అడ్డువేసి రక్షించుకుంటారు. అలాంటి బిడ్డ తమ కల్ల ముందే మరణించినా తామేమీ చేయలేని నిస్సహాయ స్థితి ఎదురైతే ఆ తల్లి గుండె తల్లడిల్లుతుంది. అలాంటి హృదయ విధారకరమైన విషయమే శ్రీనివాస్, జగదీశ్వరి దంపతులకు జరిగింది. చేతికి అందివచ్చిన కొడుకు తమ కళ్ళ ముందే మరణించడంతో క్రుంగిపోయారు. తమ బిడ్డను మర్చిపోలేక ఆ తల్లి ఏకంగా గుడి కట్టించాలని తమ బిడ్డను ఆ ఇంటి ఇలవేల్పు గా అనుకుని నిత్యం పూజలు చేస్తున్నారు.

రంజిత్ ఆఖరి కోరిక తీర్చిన ప్రభాస్…
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం గ్రామానికి చెందిన శ్రీనివాసరావు, జగదేశ్వరి దంపతులకు 1997లో రంజిత్ అనే బాబు పుట్టగా పుట్టినపుడే అతనికి కంటిలో రెటినా సమస్య ఉండటంతో పలు హాస్పిటల్స్ లో చికిత్స చేయించారు. బాబుకి ఆరేళ్ల వయసునుండి ఇక ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెరగాడని, జ్వరం కూడా వచ్చిన దాఖలాలు లేవంటూ జగదేశ్వరి చెప్పారు. అలాంటి రంజిత్ ఏంబిఏ చేస్తుండగా అతనికి కంటి సమస్య మళ్ళీ వచ్చింది. ఒక కన్ను చూపు కూడా కోల్పోవడం జరిగిందని అయితే రేడియేషన్, కీమో అంటూ హాస్పిటల్స్ లో చికిత్స అందిస్తూనే ఉన్నామని పూరీ జగన్నాథ్ వైఫ్ లావణ్య ద్వారా వదిన ద్వారా బాలకృష్ణ గారి క్యాన్సర్ హాస్పిటల్ లో కుడా చూపించినా ఫలితం కనిపించలేదు. అప్పటికే కంటి రెటినాలో ఏర్పడిన సమస్య నరాల ద్వారా లంగ్స్ తరువాత గుండె వరకు వెళ్ళిపోయిందని డాక్టర్స్ చెప్పేసారు.

ఇక అలాంటి సమయంలో తనకి ఇష్టమైనవి చేయాలని డిసైడ్ అయి కొడుకుని అడిగితే ప్రభాస్ ని కలవాలని అడిగితే పూరీ జగన్నాథ్ అలాగే ఆయన భార్య లావణ్య ద్వారా ప్రభాస్ కి విషయం తెలిపి కలిసేలా ఏర్పాట్లు చేసాం అంటూ జగదేశ్వరి తెలిపారు. ప్రభాస్, తన కొడుకుని కలిసినపుడు తనకి ఏం ఇష్టమో అడిగి చికెన్ మంచూరియా ఇష్టమని అది తెప్పించి బాహుబలి లో ఏదైనా వస్తువు కావాలని అడిగితే ఆ ఏర్పాట్లు చేసారు అంటూ జగదశ్వరి తెలిపారు. అలా 25 ఏళ్లకే బిడ్డ మరణించడంతో తట్టుకోలేని ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డ రూపాన్ని విగ్రహంగా మార్చి వాళ్ళ పొలంలో గుడి కట్టించారు. రాజస్థాన్ జైపూర్ నుండి విగ్రహం తయారు చేయించి వారి పొలంలో 15 లక్షలు వరకు ఖర్చుచేసి గుడి కట్టించారు. తమ ఇంటి దైవంగా కొడుకుని నిత్యం పూజిస్తున్నారు ఆ తల్లి.