కన్న బిడ్డలపై తల్లి అరాచకం..! ఒళ్ళంతా వాతలు, కొరికి హింసించారు..

0
56

కన్నబిడ్డలని కూడా చూడకుండా ఒక తల్లి అత్యంత ధారుణంగా దాడి చేసింది. బెంగళూరు నగరంలో చోటు చేసుకున్న ఈ ఘటన అందరినీ కలచివేస్తుంది. 6, 7 ఏళ్ల చిన్నారులపై ఒళ్ళంతా వాతలు పెట్టి, కొరికి తీవ్రంగా కొట్టి హింసించింది.. వివరాల్లోకి వెళ్తే.. హాస్పిటల్ లో హౌస్‌కీపింగ్‌ గా చేస్తున్న జయమ్మ. ఆమె భర్త కిరణ్‌ హాసన్‌లో జైలులో ఉంటున్నాడు.

ఈ నేపధ్యంలో జయమ్మతోపాటు పనిచేసే మరో మహిళ భర్త హేమంత్‌ కూడా వీళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో హేమంత్‌ మరియు అతడి కుటుంబ సభ్యులు జయమ్మ ఇంట్లోనే ఉన్న విషయాన్ని పిల్లలు తండ్రికి చెప్పారు. ఇక ఈ కారణంతో జయమ్మ, జైలులో ఉండే భర్త కిరణ్‌ల మధ్య గొడవ జరిగింది. అయితే ఈ విషయం భర్తకు చెప్పినదుకు పిల్లలపై జయమ్మ, హేమంత్‌లు ఇరువురూ కలసి దాడికి పాల్పడ్డారు. అయితే స్థానికులు ఇచ్చిన సమాచారంతో జయమ్మ, హేమంత్‌ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here