సినిమా ఇండస్ట్రీ లో చాలామంది నటులు తమలోని బాధల్ని తెరమీద చూపించరు.. లోపల ఎంత బాధ ఉన్నా బయటకి మాత్రం ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటారు. ప్రేక్షకులను అలరిస్తూ వారి బాధలను పోగొడుతారే తప్పా తమ జీవితంలో ఏ ఒక్క చేదు అనుభవాన్ని బయటకి కనిపించనీయకుండా చేస్తారు. వారి నిజ జీవితంలో జరిగే ఎన్నో చేదు అనుభవాలు ఎక్కడో ఇంటర్వ్యూ లలో చెప్తారు తప్పా తమకు తాముగా గొప్పలు చెప్పుకోవడం తెలీదు వారికి.. అలా మనందరికీ తెలిసిన నటుడు నగేష్ జీవితంలో ఎన్నో చేదు జ్ఞాపకాలు ఉన్నాయి.

రైల్వే ఉద్యోగం చేస్తూ సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో రైల్వే ఉద్యోగుల కల్చరల్ సొసైటీ లో నాటకం వేస్తే అది చూసిన స్టార్ హీరో ఎంజీఆర్ మంచి నటుడివి అవుతావని కితాబిచ్చారు. అలా సినిమాల్లోకి వచ్చి రాగానే సర్వర్ సుందరం సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు నగేష్. నటనలో కామెడీ ని పండించడంలో అయన తర్వాతే ఎవరైనా అన్నట్లు నటించేవారు. అయన నటన ముందు పెద్ద పెద్ద స్టార్ లు కూడా చిన్నబోయేవారని చెప్తుంటారు అప్పటి ఆయన్ని చూసిన వారు..
ఆయనతో పాటు జోడిగా మనోరమ నటించినప్పుడు మాత్రం ఇద్దరి జోడి చూసే ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేది.ఇప్పటికీ వారి కాంబో లో వచ్చిన సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తుంటాయి. అయన పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమాలో నటించి మెప్పించారు. ఇక నగేష్ కి ఒక సినిమా థియేటర్ కూడా ఉండేది ఆ సినిమా థియేటర్ కి సంబంధించిన పన్ను కట్టలేదని అప్పటి సీఎం అయిన ఎంజీఆర్ నగేష్ నీ జైలుకు కూడా పంపించాడు.అయితే చివరి స్టేజ్ లో నగేష్ కి అవకాశం సరిగా లేకపోవడంతో చైన్ స్మోకర్ గా మారి, విపరీతంగా మందు తాగడం వల్ల అనారోగ్యానికి గురై మరణించారు. మొత్తానికి నగేష్ గారు అటు కామెడీ చేస్తూ, విలన్ పాత్రలు వేస్తూ, ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగా నటించేవారు.కానీ ఇప్పటికీ చాలామంది ఇండస్ట్రీలో నగేష్ గారిలా నటించే నటుడు ఇకమీదట రాకపోవచ్చు అని అంటుంటారు.



























