కొన్ని సినిమాలు చిత్ర విచిత్రాలు చేస్తుంటాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమాలు.. మరో భాషలో ఫెల్యూర్ అవుతాయి. మరికొన్ని సినిమాలు స్ట్రెయిట్ గా ఫ్లాప్ అయినా.. మరో చోట విజయం సాధిస్తాయి. మరికొన్ని సినిమాలు ఏభాషలో తీసినా సూపర్ డూపర్ హిట్స్ సాధిస్తాయి.

అయితే తెలుగులో సూపర్ హిట్ కొట్టిన పలు సినిమాలు మిగతా భాషల్లో ఫ్లాప్ అయ్యాయి. ఇంతకీ తెలుగులో హిట్ కొట్టి పొరుగు భాషల్లో ఫ్లాప్ అయిన సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

*సింహాద్రి
తెలుగులో విడుల అయిన ఈ సినిమా చక్కటి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను తమిళంలో గజేంద్ర పేరుతో రీమేక్ చేశారు. హీరో విజయ్ కాంత్ నటించిన ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.

*100 % లవ్
జీవి ప్రకాష్ కుమార్ హీరోగా తమిళంలో 100 పర్సెంట్ కాదల్ పేరుతో తీశారు ఫ్లాప్ అయ్యింది

*ఇష్క్
తమిళంలో సిద్ధు హీరోగా ఉయిరే ఉయిరే పేరుతో రీమేక్ చేశారు. సినిమా ఫ్లాప్ అయ్యింది.

*అతనొక్కడే
హీరో విజయ్ నటించగా ఆథి పేరుతో తెరకెక్కించారు. కానీ ఫ్లాప్ అయ్యింది.

*కిక్
ఈ సినిమాను తమిళంలో తిల్లాలంగిడి పేరుతో జయం రవి హీరోగా తీశారు. ఫ్లాప్ అయ్యింది.

*లక్ష్యం
అరుణ్ విజయ్ హీరోగా తమిళంలో తెరకెక్కిన మాంజా వేలు కూడా ఫ్లాప్ అయ్యింది.

*అత్తారింటికి దారేది
శింబు హీరోగా తెరకెక్కిన వంత రాజవతాన్ వరువాన్ ఫ్లాప్ అయ్యింది.

*ఆర్య
ధనుష్ హీరోగా తమిళంలో కుట్టి పేరుతో రీమేక్ అయ్యింది.

*స్టూడెంట్ నెం 1
శిబిరామ్ హీరోగా స్టూడెంట్ నెం 1పేరుతో రీమేకై ఫ్లాప్ అయ్యింది.

*లౌక్యం
తమిళంలో సంతానం హీరోగా సక్క పోదు పోదు రాజాగా తెరకెక్కి పరాజయం పాలైంది.

*అలా మొదలైంది
గౌతమ్ కార్తిక్ హీరోగా ఎన్నామో ఏదో పేరుతో రీమేక్ అయ్యింది.

*శౌర్యం
విశాల్ హీరోగా తమిళంలో వేడి పేరుతో రీమేక్ అయ్యింది.

*ఆది
ప్రశాంత్ హీరోగా జై పేరుతో రీమేక్ అయిన ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.

*దిల్
శింబు హీరోగా కుత్తు పేరుతో రీమేక్ అయిన ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.

*జులాయి
ప్రశాంత్ హీరోగా సాహసం పేరుతో సినిమా తెరకెక్కింది. కానీ పరాజయాన్ని మూటగట్టుకుంది.



































