బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ కేసుపై నెటిజన్లందరికీ రోజుకో సందేహమొస్తుంది. ఈ సందేహాలపై రాజకీయ నాయకులు కూడా స్పందిస్తున్నారు. తాజాగా బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి “సుశాంత్ మరణం తర్వాత ఆయన హౌస్ ముందు 2 అంబులెన్సులు ఎందుకున్నాయి.? సరిగ్గా ఆ టైంలోనే ఆ అంబులెన్స్ కోసం ఎవరు కాల్ చేశారు?” అని ప్రశ్నించారు. అంతేకాకుండా.. అత్యంత నమ్మకస్తుడైన సుశాంత్ ఫ్రెండ్ శ్యామ్యూల్ ఆ టైంలో సుశాంత్ బలవాన్మరణం చేసుకున్న స్పాట్ లో లేకపోవడంతో సుశాంత్ మరణం వెనుక ఉన్న బలమైన కారణాలు ఏమిటనే దిశగా బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి తన ట్విట్టర్ ఖాతాలో ప్రశ్నల వర్షం కురిపించారు.

సుశాంత్ ప్రాణాలు తీసుకున్న టైమ్ లో బాంద్రాలోని సుశాంత్ హౌస్ కి 2 అంబులెన్సులు రావడంతో సోషల్ మీడియాలో సుశాంత్ ఫ్యాన్స్ అప్పుడే సందేహాలను వ్యక్తం చేశారు. దాంతో ముంబై పోలీసులు అలెర్ట్ అయ్యి.. సుశాంత్ మరణ సంఘటనపై సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టక పోవడంతో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి తన సందేహాన్ని తెలియ జేశారు. సుశాంత్ మరణించడానికి ముందు రోజు ఆయనతో పాటు సుశాంత్ ఇంట్లో శామ్యూల్ కూడా ఉన్నాడన్న సంగతి ఈమధ్యనే ఓ ప్రముఖ టీవీ ఛానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో బయటకు వచ్చింది.

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ ప్రాణాలు తీసుకున్న తర్వాత శ్యామ్యూల్ కనిపించకుండా పోవడం వెనుక ఏదో బలమైన రహస్యం దాగుందంటూ ఎన్నో అనుమానాలు సుశాంత్ ఫ్యాన్స్ నుండి వ్యక్తమౌతున్నాయి. సుశాంత్ మరణించి ఇన్ని రోజులైనా సరే.. శామ్యూల్ కనిపించకుండా వెళ్ళిపోయాడంటే అసలు శామ్యూల్ బతికే ఉన్నాడా.? లేక అతనిని కూడా ఎవరైనా చంపేశారా.? ఇన్ని సందేహాలున్న సుశాంత్ కేసు విషయంలో అతని డెడ్ బాడీకి పోస్టు మార్టం చేసిన డాక్టర్‌ను కూడా ఓ సారి విచారించాలని.. అప్పుడే అసలు రహస్యాలన్నీ బయటకొస్తాయంటూ తాజాగా సుబ్రమణ్య స్వామి తనదైన శైలిలో ఆరోపణలు చేయడంతో సుశాంత్ కేసుకు సంబంధించిన టాపిక్ మరోసారి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
Why were two ambulance? Who called them? If I don’t get truthful answers we may get a clue why SSR loyal servant Samuel is missing . Is he alive or dead.? Was one ambulance intended for him?
— Subramanian Swamy (@Swamy39) August 14, 2020



























