Mr & Mrs Aliya Ranbir : ఏప్రిల్ 14 న ఘనంగా ఆలియా రణ్ బీర్ ల పెళ్లి ఎంతో ఆడంబరంగా ముంబయిలో జరిగింది. ఇక అత్యంత సన్నిహితులు బంధువుల మధ్య జరిగిన ఈ వివాహంలో ఆలియా రణ్ బీర్ లు చాలా క్యూట్ గా ఉన్నారు. వివాహం తరువాత వారి ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు.

ముందుగా పితృ పూజ తో ప్రారంభమైన వీరి వివాహం వేడుక తరువాత అలియాభట్ ఇంట్లో ఘనంగా మెహందీ వేడుక ను చేసారు. ఇక మెహందీ వేడుకలో బాలీవుడ్ హీరోయిన్ కరిష్మా కపూర్ సందడి చేసింది. ఇక రణ్ బీర్ సోదరి రిద్దిమా కపూర్, కరిష్మా కపూర్ ఇద్దరు వాళ్ల మెహందీ లను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. ఇక ఈ ఫంక్షన్స్ తర్వాత రణ్ బీర్ తల్లి మీడియాకు పెళ్లి 14 తేదీన జరుగుతుందని చెప్పారు.
ఇక వివాహం ముంబై లో బాంధ్రలోని వాస్తు అపార్టుమెంట్ లో సింపుల్ గా జరిగింది. ఇక వివాహం అనంతరం అలియాభట్ రణ్ బీర్ లు వారి పెళ్లి ఫోటోలను సోషల్ మేసినా లో పంచుకున్నారు. ఇక ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చిన కొత్త జంట ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇక వెనక్కి వెళ్తున్నపుడు అలియాభట్ ను రణ్ బీర్ ఎత్తుకోవడం హైలైట్ గా నిలిచింది.ఇక ఇపుడు ఆలియాభట్ రణ్ బీర్ వివాహానికి సంబంధించిన వార్తలు వివాహ ఫోటోలు ఇక సోషల్ మీడియా లో బాగా సందడి చేస్తున్నాయి.



























