MS Raju : దేవి, వర్షం, ఒక్కడు, నువ్వొస్తానంటే నేనోద్ధాంటాన వంటి వరుస హిట్లతో వరుస ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్న నిర్మాత ఎంఎస్ రాజు గారు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ద్వారా అభిరుచి గల నిర్మాత. ఆయన బ్యానర్ లో సినిమా అంటే కచ్చితంగా కథ బాగుంటుంది అనేంతలా ఆయన మార్క్ వేసుకున్నారు. వరుస సక్సెస్ లు చూసిన ఎంఎస్ రాజు గారు ఆ తరువాత వరుస ఫ్లాప్స్ అందుకుని ప్రస్తుతం చిన్న సినిమాలను తీస్తున్నారు. ఇక డైరెక్టర్ గా మారి ‘డర్టీ హరి’ అనే బోల్డ్ అటెంప్ట్ చేసిన ఎంఎస్ రాజు గారు ఇటీవల కొడుకు సుమంత్ అశ్విన్ హీరోగా ‘సెవెన్ డేస్ సిక్స్ నైట్స్’ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం చిన్న సినిమాలకు పరిమితమైన ఎంఎస్ రాజు గారు ఆయన అనుభవాలను ఇటీవల పలు ఇంటర్యూ లలో పంచుకున్నారు.

త్రిష డైరీ ఇచ్చేది… ఆట సినిమా సమయంలో జరిగింది ఇదే…
వర్షం హిట్ తరువాత త్రిష, ప్రభాస్ అందరికీ మంచి ఆఫర్స్ వచ్చాయి. ఇక వెంటనే సినిమా చేద్దామని అనుకునేటప్పుడు త్రిషనే ముందు వచ్చి డైరీ ఇచ్చి డేట్స్ తీసుకోండి నెక్స్ట్ ప్రాజెక్ట్ కి అంకుల్ అని చెప్పేది. ఇక నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాకి కథ రెడీ చేసుకున్నాక మళ్ళీ చిన్న వాళ్ళతోనే సినిమా చేయాలని అనుకున్నాను. అలా ప్రభుదేవా డైరెక్షన్ కుదిరింది అందరూ కామెంట్స్ చేసారు హిట్లువచ్చి వరుసగా రాజు కి తెలియడంలేదు అన్నా ఆయన పట్టించుకోలేదు. ఇక సిద్ధార్థ ను హీరోగా అనుకున్నాము, రైటర్స్ పరుచూరి వెంకటేశ్వర్రావు గారు సరదాగా ఏంటండీ ఆ అబ్బాయి అంత జుట్టేసుకుని అంటూ కామెంట్ చేస్తూనే డైలాగులు రాసేవారు. అలా సినిమా అయింది, అది మంచి హిట్ అవడంతో అందరికీ మంచి కెరీర్ వచ్చింది.

ఆట సమయంలో అదే గొడవ…
ఇక సిద్ధార్థ హీరోగా ఇలియానా హీరోయిన్ గా ‘ఆట’ సినిమా తీస్తున్నపుడు నా దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన డైరెక్టర్ వీర శంకర్ కన్నడ ఆలోచనతో ఒక సినిమా చేసాము అదే ‘నమ్మ బసవ’. పునీత్ రాజ్ కుమార్ అందులో హీరో, ఆ సినిమాలోని ఒక సన్నివేశం చాలా బాగుంటుంది దాన్ని నేను ఆట సినిమాలో వాడాలనుకుని వీర శంకర్ ను అడిగితే వాడుకొండని చెప్పాడు. నెక్స్ట్ తనతో వేరే ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నాను. చిన్న ఇష్యూ ఉందండి ఇందులో అని చెప్పాడు వీర శంకర్. ఇక సీన్స్ వాడాలని అనుకున్నపుడు అగ్రిమెంట్ లాంటిది తీసుకోవాలని నాకు తెలియదు, వీర్ శంకర్ కు నాకు మధ్య ఎవరో ఏవో అపద్ధాలు చెప్పడం.. ఎమ్ ఎస్ రాజు నిన్ను వాడుకుంటున్నాడు, నీతో సినిమా చేయడు అంటూ చెప్పడం తో వీర శంకర్ ఛాంబర్ లో ఫిర్యాదు చేసాడు కథ నాది అంటూ. ఇద్దరిదీ తప్పు ఉందని నేను అనుకోవడం లేదు, కేవలము మధ్య ఉన్న వ్యక్తుల వల్ల వీర్ శంకర్ నన్ను అపార్థం చేసుకున్నాడు.



























