పరిచయం అవసరంలేని పేరు. భారత ఆర్థిక వ్యవస్థను శాసించగల ఘనుడు. దేశంలోనే అత్యంత సంపన్నుడు. ఆసియా కుబేరుల్లోనూ టాప్‌లో కొనసాగుతున్న దిగ్గజం. అంతర్జాతీయ ధనవంతులతో పోటీపడుతున్న పారిశ్రామికవేత్త. ఆయనే ముఖేష్ ధీరూభాయ్ అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థకు అధ్యక్షుడు అత్యధికంగా 35శాతం వాటాదారునిగా ఉన్నారు.

ధీరూభాయ్ అంబానీ, కోకిలాబెన్ అంబానీల మొదటి సంతానం ముఖేష్ అంబాని. ధీరూభాయ్ అంబానీ రెండవ కుమారుడు అనిల్ అంబాని. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బిల్డింగ్ లో నివాసం ఉంటున్నారు ముఖేష్ అంబానీ. అయన ఇల్లు విలువ సుమారు 2 బిలియన్ డాలర్లు ఉంటుంది.

ఆసియాలోనే అత్యంత ధనవంతులలో ఒకరు అయిన ముఖేష్ అంబాని, నేటికీ ఆ స్థానాన్ని ముఖేశ్ కాపాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు హరున్ గ్లోబల్ రిచ్ సంస్థ ప్రకటించిన కుబేరుల జాబితాలోనూ ఆయనే నంబర్ వన్ స్థానంలో నిలిచారు. భారత్‌లోనే కాదు… ఏషియాలోనే ఆయనను మించిన బిలియనీర్ మరొకరు లేరు. అలాంటి ముఖేశ్ ఆస్తి ఇప్పుడు ఎంతనుకుంటున్నారు ? మీ ఊహకు కూడా అందనంత సంపాదన ఆయన సొంతం.

ముకేశ్ అంబానీ సంపాదన విలువ అక్షరాలా 67 బిలియన్ డాలర్లు. అంటే దాదాపు నాలుగు లక్షల కోట్లకు పైమాటే. ఇది రెండు తెలుగు రాష్ట్రాల ఏడాది బడ్జెట్‌తో సమానం. మరి ముఖేష్ ఆదాయం రోజుకు, గంటకు ఎంత ఉంటుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. ప్రతి రోజు ఆయన 168 కోట్లు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అంటే గంటకు ముఖేష్ ఆదాయం ఏడు కోట్లన్న మాట. దీన్ని ఇక నిమిషాల్లోకి మార్చుకోండి. ఎంతుంటుందో మీరే తేల్చుకోండి.




























