బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ కేస్ కు సంబంధించిన వివరాలను ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ బిర్ సింగ్ ఈమధ్య ఒక మీడియా సమావేశంలో తెలియ జేశారు. వివరాల్లోకి వెళ్తే..

తన మాజీ మేనేజర్ దిశా సలియన్ మరణంతో తన పేరును ముడిపెట్టడం సుశాంత్‌ ను బాగా ఇబ్బంది పెట్టిందని, ఆయన తీవ్ర ఆందోళనకు గురయ్యారని, దిశ చనిపోయిన తర్వాత తన గురించి మీడియాలో ఎలాంటి ఆర్టికల్స్ రాశారో తెలుసుకోవడానికి తన పేరును స్వయంగా గూగుల్‌లో సుశాంత్ సెర్చ్ చేసినట్టు, తన పేరుతో పాటు ‘painless death’, ‘schizophrenia’, ‘bipolar disorder’ గురించి కూడా సుశాంత్ సెర్చ్ చేసినట్టు, సుశాంత్ బైపోలార్ డిజార్డర్‌తో బాధ పడుతున్నారని, దానికి చికిత్స కూడా తీసుకున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, దానిపై దర్యాప్తు చేస్తున్నామని, ‘ఆరోజు రాత్రి తను చనిపోవడానికి సుమారు 2 గంటల ముందు తన పేరును సుశాంత్ గూగుల్‌ లో సెర్చ్ చేశారు. దిశా సయని మరణానికి ముందు ఆ రోజు రాత్రి ఆమెక్కాబోయే భర్త ఇంట్లో పార్టీ జరిగింది. ఉదయం 3 గంటల టైంలో ఆమె బలవాన్మరణం పొందారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మేం నిర్ధారణ చేసుకున్నాం. దిశ కాబోయే భర్తతో పాటు ఐదుగురు ఆ రోజు రాత్రి పార్టీలో పాల్గొన్నారు. మిగిలిన నలుగురిలో రాజకీయ నాయకులెవరూ లేరు’’ అని ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ బిర్ సింగ్ స్పష్టం చేశారు. ఈ పార్టీలో రాజకీయ నాయకులు పాల్గొన్నారని వస్తోన్న రూమర్స్ పై విధంగా కమిషనర్ వివరణ ఇచ్చారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14న ఉరివేసుకొని చనిపోగా.. ఆ సంఘటనకు 5 రోజుల ముందు దిశ మృతి చెందారు. ఆమెది ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా కేసు నమోదు చేశారు. అని ముంబై పోలీస్ కమిషనర్ తెలిపారు. ఇక బిహార్ పోలీసులు ముంబైలో దర్యాప్తు జరపడం గురించి కమిషనర్ మాట్లాడుతూ.. ‘‘ఈ కేసును దర్యాప్తు చేసే అధికారం బీహార్ పోలీసులకు లేదు. దీనిపై మేం లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నాం. మేం ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదు. సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఇచ్చిన కంప్లయింట్‌ మా వరకు రాలేదు. ఏ అధికారిని క్వారంటైన్ చేయడంలోనూ మా పాత్ర లేదు. ఇది బీఎంసీ తీసుకున్న నిర్ణయం’’ అంటూ బిహార్ ఐపీఎస్ ఆఫీసర్ వినయ్ తివారీని బలవంతంగా క్వారంటైన్‌కు పంపారన్న ఆరోపణలపై కమిషనర్ వివరణ ఇచ్చారు. అలాగే, సుశాంత్ సింగ్ ఫ్యామిలీ పాట్నాలో కేసు నమోదు చేయడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు కమిషనర్ స్పందిస్తూ.. ‘‘జూన్ 16న మాకు ఇచ్చిన స్టేట్‌మెంట్స్‌ లో ఎవరిపై ఎలాంటి అనుమానం లేదని సుశాంత్ కుటుంబం తెలిపింది’’ అని తెలియ జేశారు. అంతేకాకుండా సుశాంత్ బ్యాంక్ ఖాతా నుంచి 15 కోట్ల రూపాయలు మాయమయ్యాయని ఆయన తండ్రి చేస్తోన్న ఆరోపణలపై కూడా కమిషనర్ స్పందించారు. ‘‘ఆయన బ్యాంక్ ఖాతాలో రూ.18 కోట్లు ఉన్నట్టు మా దర్యాప్తులో గుర్తించాం. ప్రస్తుతం రూ.4.5 కోట్ల మేర ఖాతాలో ఉంది. మిగిలిన సొమ్ము ఎవరికి ట్రాన్స్‌ఫర్ అయ్యింది అనే విషయంలో దర్యాప్తు జరుగుతోంది. ఆ సొమ్ము రియా చక్రవర్తి అకౌంట్‌కు డైరెక్ట్‌గా ట్రాన్స్‌ఫర్ కాలేదు’’ అని కమిషనర్ ఇంటర్వ్యూను ముగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here