Murali Mohan : ఇండస్ట్రీ లో హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన అటు పాలిటిక్స్ లోకి వచ్చి అక్కడ తనదైన ముద్ర వేశారు. ఈ మద్య కాలంలో సినిమాలను తగ్గించిన ఆయన పలు ఇంటర్వ్యూ ల్లో పాల్గొంటు సినిమా రంగంలోని అనేక విషయాల గురించి మాట్లాడుతున్నారు. ఇక ఇటీవల చిరంజీవి గారి గురించి కోట గారు చేసిన వాఖ్యలు స్పందించిన ఆయన కోట గారి గురించి ఆసక్తికర వాఖ్యలు చేసారు.

చిరంజీవి గురించి మాట్లాడే ముందు నువ్వు ఎం చేసావ్…
మురళి మోహన్ గారు పలు విషయాల గురించి మాట్లాడుతూ చిరంజీవి తొలినాళ్ళలో చాలా కష్టపడే వాడంటూ కొంచెం ఖాళీగా సమయం దొరికిన డాన్స్ ప్రాక్టీస్ చేయడం అలా చేసేవాడు. ఇక తాను ఎదుగుతున్న సమయంలో గిట్టనివాళ్లు విష ప్రయోగం చేసి ఉండొచ్చు అంటూ అప్పటి విషయాల గురించి క్లారిటీ ఇచ్చారు. ఇక కోట శ్రీనివాసరావు గారు చిరంజీవి గారు సేవ కార్యక్రమాలు ఎం చేశారుంటూ కామెంట్స్ చేసిన విషయం గురించి మాట్లాడుతూ చిరంజీవి విషయం పక్కన పెట్టి ముందు కోట శ్రీనివాసరావు ఏం సేవ కార్యక్రమాలు చేసారో చెప్పాలి అంటూ ఫైర్ అయ్యారు మురళి మోహన్.

చిరంజీవి ఎందరికో సహాయం చేసారు చేస్తూనే ఉన్నారు. కొంత మంది కొంచెం సహాయం చేసి ఎక్కువ పబ్లిసిటీ చేసుకుంటారు. కానీ చిరంజీవి ఎంతోమంది మందికి ఎంతో సహాయం చేస్తున్న కొంచెం కూడా బయటికి చెప్పుకోడానికి ఇష్టపడడు. చిరంజీవి మాములుగా చెడు చెవిలో చెప్పాలి మంచి మైక్ ముందు చెప్పాలి అంటాడు కానీ తను చేసిన మంచి పనులను కూడా చెవిలోనే చెబుతున్నాడు అంటూ మాట్లాడారు మురళి మోహన్.



























