Music Director Chakri brother Mahith Narayan : తెలంగాణ మహబూబాబాద్ కి చెందిన గిల్లా చక్రధర్ సినిమా ఇండస్ట్రీలో చక్రి గా బాగా ఫేమస్ అయ్యారు. మ్యూజిక్ రికార్డింగ్ లో మంచి పేరు సంపాదించుకున్న పూరీ జగన్నాథ్ ‘బాచి’ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయమయ్యారు. ఆ తరువాత సత్యం, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు అంటూ వరుస హిట్లతో సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుగులో స్థిరపడిన చక్రి గారు 2014లో అర్థాంతరంగా నిద్రలోనే కన్ను మూశారు. ఆయన మరణం తరువాత ఇంట్లో గొడవలు, భార్య చక్రి గారి తల్లి తమ్ముడి మీద కేసులు పెట్టడం వంటివి జరిగాయి. అయితే ఇవన్నీ జరిగిన ఇన్నేళ్లకు చక్రి గారి తమ్ముడు మ్యూజిక్ డైరెక్టర్ మహిత్ నారాయణ్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. అప్పటి సంఘటనల గురించి చెప్పారు.

అమ్మే విషమిచ్చిందని కేసు పెట్టారు…
చక్రి గారి మరణం మీద ఎన్నో అనుమానాలు ఉన్నా పోస్టుమార్టం కూడా జరగకుండానే ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఆయనకు ఒక తమ్ముడు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. అయితే చక్రి గారి మొదటి భార్యతో విడాకులు తీసుకుని రెండో పెళ్లి శ్రావణి అనే ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నారు. చక్రి గారి తండ్రి మరణించాక ఇంట్లో గొడవలు మొదలయ్యాయని చక్రి తమ్ముడు మహిత్ తెలిపారు. అన్న మరణించే రోజు రాత్రి కూడా 11 వరకు అన్నతో ఉన్నానని నిద్రలోనే మరణించారని ఏం జరిగిందో తెలియదని తెలిపారు. అయితే తన తల్లే విషం పెట్టి అన్నను చంపినట్లు పోలీస్ కేసు మా వదిన పెట్టింది. ఇంతకంటే దారుణం ఏముంటుంది, కన్నతల్లి ఎక్కడైనా విషం పెడుతుందా బిడ్డకు అంటూ ఎమోషనల్ అయ్యారు మహిత్.

అప్పుడు వదిన అన్ని మీడియాల్లోనూ తనను మేము హింసించినట్లు మాట్లాడింది. తనకు అన్న ఆస్తులు కావాలి అంతే. అపుడు మేము వచ్చి మాట్లాడినా మొదట మాట్లాడిన వాళ్ళవే మ్ముతారు అనే ఉద్దేశంతో ఇక మీడియా ముందుకు రాలేదు. జరగకూడనిదే జరిగాక ఇక మా మీద ఎలాంటి నిందలు పడినా ఏముంది అనిపించింది. నన్ను తండ్రిలా పెంచిన అన్న పోయాక ఇంక అంతకన్నా దారుణం ఏముంటుంది. ఇప్పటికీ ఎపుడైనా సంతోషంగా అందరం కూర్చొని నవ్వుకున్నా అన్న ఎలా మరణించాడో ఆ క్షణం ఎంత బాధపడి ఉంటాడో అని తలుచుకున్నపుడు ఒక్కసారిగా బాధేస్తుంది అంటూ తెలిపారు.

































