సినిమా ఇండస్ట్రిలో ప్రేమ, పెళ్లి, నచాకపోతే విడాకులు, మరొకరితో డేటింగ్ ఇవన్ని సర్వసాధారణంగా జరుగుతుంటాయి. తరచూ ఎవరో ఒకరుకి ఎఫైర్ ఉందంటూ వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే తరచూ మనం నటీనటుల మధ్య వార్తలు వింటూ ఉంటాం.. కానీ ఈసారి మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ వ్యవహారం ఆసక్తి రేపుతున్నాయి. “గీతా గోవిందం” సినిమా పాటలతో అందరిని ఆకర్షించిన గోపిసుందర్. 19 ఏళ్ల తన వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పాడు గోపి సుందర్. వీరిద్దరికీ ఇద్దరు కుమారులు కుడా ఉన్నారు. అయితే భార్యతో మనస్పర్ధలు రావడంతో విడాకులకు అప్లై చేసారు.

అయితే వీరి మనస్పర్ధలకు కారణం సింగర్ అభయ హిరణ్మయితో గోపిసుందర్ డేటింగ్ చేస్తున్నాడని, అందువల్లనే వీరి దాంపత్య జీవితంలో మనస్పర్ధలు వచ్చాయని వార్తలు వినిపించాయి. ప్రస్తుతం దీనిపై అయన స్పందిస్తూ తను హిరణ్మయితో అయన డేటింగ్ చేస్తున్న మాట వాస్తవమని చెప్పారు. తాజగా సోషల్ మీడియాలో అయన హిరణ్మయితో దిగిన ఫోటోతో ఒక పోస్టు పెడుతూ.. “నా ఉనికికి కారణం నువ్వే…” ఆని కామెంట్ పెట్టారు. ప్రస్తుతం ఇది నేట్టింట వైరల్ గా మారింది. అయితే యువ సింగర్ హిరణ్మయితో గోపి సుందర్ గత తొమ్మిదేళ్లుగా డేటింగ్ చేస్తున్నట్టు సమాచారం.



































