బీజేపీలో చేరడం పై వ్యాఖ్యలు చేసారు కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్. తాను బ్రతికి ఉన్నంతవరకూ మాత్రమె కాదు చనిపోయాక తన మృతదేహం కూడా బీజేపీలో చేరదని కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు.

తాము అసలైన కాంగ్రెస్ వాదులమని అన్నారు అయన. బీజేపీలో చేరాలని తన జీవితంలో ఎప్పుడూ అనుకోలేదని, ఒక వేళ, కాంగ్రెస్ నాయకత్వం తనను పార్టీ వేల్లిపోమ్మంటే అప్పుడు దాని గురించి ఆలోచిస్తానని అన్నారు. అప్పుడు కూడా బీజేపీలో మాత్రం చేరబోనని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ నేత జితిన్ ప్రసాద్ బీజేపీలో చేరుతున్న నేపథ్యంలో కపిల్ సిబల్ ఈ మేరకు గురువారం స్పందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here