Shivani: టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ హీరోగా జీవిత దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శేఖర్. ఈ సినిమా ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా రిలీజ్ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ వేడుకలో రాజశేఖర్ కుటుంబం సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.

జీవిత దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా ముస్కాన్, ఆత్మీయ రాజన్ హీరోయిన్లుగా శివాని ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కింది.ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా రాజశేఖర్ కూతురు శివాని మాట్లాడుతూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించిన సమయంలో కరోనా కేసులు తీవ్రస్థాయిలో పెరిగిపోయాయి.దీంతో తాను కరోనా బారిన పడ్డానని తనకు కరోనా రావడం వల్ల తన నుంచి తన తండ్రి కూడా కరోనా బారిన పడ్డారని శివాని తెలిపారు.

కరోనా నుంచి నేను తొందరగా కోలుకున్నప్పటికీ నాన్న మాత్రం చాలా అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. ఒకానొక సమయంలో డాక్టర్లు 50-50 ఛాన్స్ అని కూడా చెప్పారు. ఆ సమయంలో నాన్నను అలా చూసేసరికి నాన్న ఇలా కావడానికి ప్రధాన కారణం నేనే కదా అని నాపై నాకు చాలా కోపం వచ్చిందని శివాని తెలిపారు. ఆ సమయంలో బయట వాళ్ళు అందరూ నన్ను నష్ట జాతకురాలని పిలిచారు. నాకు అదే అనిపించింది.
వద్దని చెప్పిన సిగరెట్ తాగారు…
నాన్నను ఆ పరిస్థితులలో చూసి తట్టుకోలేకపోయానని భగవంతుడి దయవల్ల నాన్న ఆరోగ్యంగా బయటపడ్డారని శివాని ఈ సందర్భంగా తన నాన్న ఆరోగ్యం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. వేదికపై శివాని మాట్లాడుతూ వుండగా రాజశేఖర్ కుమార్తె శివాత్మిక కూడా ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఇక కరోనా నుంచి కోలుకున్న తర్వాత నాన్న ఎంతో యాక్టివ్ గా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ సినిమాలో తన పాత్ర సిగరెట్ తాగితేనే అద్భుతంగా ఉంటుంది. కానీ అప్పటికే కరోనా సోకిన నాన్న లంగ్స్ దెబ్బతిన్నాయి. అందుకే సిగరెట్ వద్దని చెప్పినా వినకుండా ఈ పాత్ర హైలెట్ కావాలంటూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుని సిగరెట్ తాగారని,ఈ సందర్భంగా ఈ సినిమా కోసం రాజశేఖర్ పడిన కష్టం గురించి శివాని వెల్లడించారు.





























