Naatu Naatu Song:తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డివివి దానయ్య నిర్మాణంలో రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రం త్రిబుల్ ఆర్. ఈ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును అందుకోవడంతో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ఈ విజయం పై స్పందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇలా ఈ సినిమా ఇప్పటికే ఎన్నో పురస్కారాలను అందుకుంది అయితే ఈ వేడుకలలో భాగంగా నిర్మాత దానయ్య ఇక్కడ కనిపించకపోవడంతో అసలు దానయ్య రాకపోవడానికి గల కారణం ఏంటి అని పెద్ద ఎత్తున ఆరా తీశారు.ఇలా ఏ ఒక్క వేడుకలో కూడా దానయ్య కనిపించకపోవడంతో అసలు ఏం జరిగింది అని పలువురు సందేహాలు వ్యక్తం చేశారు.
ఇక ఆస్కార్ అవార్డు రావడంతో ఈ విషయంపై నిర్మాత దానయ్య స్పందించారు. ఇలా తను నిర్మించిన ఒక సినిమాలోని పాటకు ఆస్కార్ అవార్డు రావడం నిజంగా గర్వించదగ్గ విషయమని ఈయన తెలిపారు. RRR సినిమా రిలీజ్ తర్వాత చరణ్, తారక్, రాజమౌళి, RRR టీం ఎవ్వరితో నేను కాంటాక్ట్ లో లేననీ ఈ సందర్భంగా దానయ్య వెల్లడించారు.

Naatu Naatu Song: సినిమా రిలీజ్ తర్వాత కాంటాక్ట్ లో లేను….
తన నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ ఈయన మాత్రం సినిమా విడుదల తర్వాత వీరితో కాంటాక్ట్ లేను అని చెప్పడంతో అసలు ఎందుకు లేరనే విషయం చర్చలకు దారితీస్తుంది. ఈ సినిమా ఆస్కార్ ప్రమోషన్లకు దానయ్య అడిగిన మొత్తంలో డబ్బు ఇవ్వకపోవడం వల్లే రాజమౌళి దానయ్య మధ్య మనస్పర్ధలు వచ్చాయని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.































