Naatu Naatu Song: అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి ఆ క్షణం రానే వచ్చింది. 95వ అంతర్జాతీయ ఆస్కార్ వేడుకలలో భాగంగా ఒక తెలుగు సినిమా ఆస్కార్ నామినేషన్ లో నిలవడంతో ఈ ఆస్కార్ అవార్డు వేడుకల కోసం ప్రతి ఒక్క భారతీయుడు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. ఇక భారత కాలమానం ప్రకారం ఈ అవార్డు వేడుకలు నేడు తెల్లవారుజామున 5:30 లకులవ్స్ ఏంజల్స్ లోని డాల్బీ థియేటర్లో ప్రారంభం అయ్యాయి.

ఈ వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇకపోతే ఈ అవార్డు వేడుకలలో భాగంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నిలిచిన విషయం మనకు తెలిసిందే.ఇక ఈ పాట ఇప్పటికే ఎన్నో అవార్డులను అందుకుంది. తప్పకుండా ఆస్కార్ కూడా అందుకుంటుందని అందరూ భావించారు.
ఇలా అందరూ ఈ అవార్డు వేడుకల కోసం ఎదురు చూస్తూ ఉండగా ఆ క్షణం రానే వచ్చింది. అందరూ ఊహించినట్టు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో భాగంగా నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు అందుకుంది.ఇలా 95వ అంతర్జాతీయ ఆస్కార్ అవార్డు వేడుకలలో తెలుగు సినిమా సత్తా చాటాడంతో ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీకే కాకుండా భారతదేశానికే గర్వకారణం అని చెప్పాలి.

Naatu Naatu Song: ఆస్కార్ అందుకున్న కీరవాణి.. చంద్రబోస్…
ఇలా ఒక తెలుగు సినిమా అంతర్జాతీయ వేదికపై అత్యున్నతమైన ఆస్కార్ పురస్కారాన్ని అందుకోవడంతో ప్రతి ఒక్క భారతీయుడు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆస్కార్ వేదికపై మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డులను అందుకున్నారు.ఇలా ఒక తెలుగు సినిమా ఇంత మంచి విజయం అందుకోవడంతో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు సామాన్య ప్రజలు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
'Naatu Naatu' from 'RRR' wins the Oscar for Best Original Song! #Oscars #Oscars95 pic.twitter.com/tLDCh6zwmn
— The Academy (@TheAcademy) March 13, 2023





























