కర్నాటక అడవులకు బయలుదేరిన బాలయ్య..

0
165

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఓ మంచి కంబ్యాక్ కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నాడు.. ఇటీవల కాలంలో ఆయన నటించిన ఎన్టీఆర్ రెండు భాగాలతో పాటు, కే ఎస్. రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన రూలర్ సినిమా కూడా ప్లాప్ అయ్యింది.. అందుకే కొంత గ్యాప్ తీసుకున్న ఈ సీనియర్ హీరో తన లక్కీ డైరెక్టర్ బోయపాటి శ్రీను తో హ్యాట్రిక్ సినిమా చేస్తున్నాడు బాలయ్య.. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమా BB3 అనే పేరుతో పిలవబడుతుంది.. ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ కనబర్చి.. సినిమాపై అంచనాలను పెంచేసింది.. దానికి ఏమాత్రం తీసిపోకుండా దర్శకుడు బోయపాటి ఈ సినిమాను రూపొందిస్తున్నారు..

సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రలను పోషిస్తున్నారు.. అందులో ఒకటి అఘోర పాత్ర అయితే.. మరొకటి ఫ్యాక్షనిస్ట్ పాత్ర అని సమాచారం.. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది.. దాని ప్రకారం ఈ సినిమా తాజా షెడ్యూల్ కోసం బాలకృష్ణ అండ్ టీం కర్ణాటకలోని దండేలి అడవులకు వెళ్లిందట. నేటి నుంచి దండేలి అడవుల్లో యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించనున్నాడట బోయపాటి. ఏప్రిల్ 3 వరకు కీ షెడ్యూల్ అక్కడే పూర్తి చేయనున్నారు.

ఇక సినిమాలో బాలయ్యకు జోడిగా ప్రగ్యా జైస్వాల్, పూర్ణ కథానాయికలుగా నటిస్తున్నారు.. ప్రముఖ హీరో శ్రీకాంత్ ఓ నెగటివ్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాను యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.. మే 28 ఎన్టీఆర్ జయంతి సందర్భంగా విడుదల కానున్న ఈ సినిమాకు గాడ్ ఫాదర్, మోనార్క్ అనే టైటిల్స్ ను చిత్ర పరిశ్రమలో పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..ఇక ఈ సినిమా తర్వాత గోపిచంద్ మలినేని, అనిల్ రావిపూడి లాంటి హిట్ డైరెక్టర్స్ తో తన తదుపరి సినిమాలను లైన్లో పెట్టాడు ఈ సీనియర్ హీరో…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here