Naga Chaitanya : నాగచైతన్య, సమంత విడాకుల తరువాత వాళ్లిద్దరూ ఎవరితో ఉన్నా అది పెద్ద చర్చే అవుతుంది. వారు విడిపోయాక వ్యక్తిగత జీవితాలలో ఎవరితో ఉన్నా ఏవేవో కామెంట్స్ చేస్తూ సోషల్. మీడియాలో పెట్టేస్తున్నారు. ఇక ఈమధ్య తెగ వైరల్ అవుతున్న మరో వార్త నాగచైతన్య పెళ్లి. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు హల్‌చల్ చేసాయి. ఇక వీటిపై నాగ చైతన్య కానీ అటు అక్కినేని ఫ్యామిలీ కానీ స్పందించలేదు. ఇక ఇపుడు నాగ చైతన్య గురించి మరో వార్త తెగ వైరల్ అవుతోంది.

ప్రాచీ దేశాయ్ తో క్లోజ్ గా ఉన్న నాగ చైతన్య…..
చైతూ ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో హిట్ కొట్టిన చైతన్య ఇప్పుడు మరోసారి మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వములో థాంక్యూ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ధూత్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ డిజిటల్ ప్లాట్ ఫామ్ పై అడుగుపెడుతున్నాడు. ఇక దూత్ వెబ్ సిరీస్ ఒక హార్రర్ జోనర్ సిరీస్. ఇందులో చైతు, ప్రాచీ దేశాయ్, పార్వతి మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఇక నాగచైతన్య, ప్రాచీ దేశాయ్ క్లోజ్ గా ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నాగచైతన్య ప్రాచీ దేశాయ్ కి ఆసియన్ రుచులు కూడా చూపించాడట రెస్టారెంట్ కి తీసుకెళ్లి. ఇక ఈ విషయాన్ని ప్రాచీ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

‘Thank you’ @Vikram_K_Kumar & @chay_akkineni for making #Dhootha & working in Hyderabad such a breeze!
— Prachi Desai (@ItsPrachiDesai) June 15, 2022
Not pictured here – me learning my lines in Telugu & gorging on Shoyu food.. pic.twitter.com/0aEKzok0iO
అంతే కాకుండా తెలుగు కూడా కొన్ని లైన్స్ నేర్పించారని అందులో రాసుకొచ్చింది. అయితే ఈ పోస్ట్ లో విక్రమ్ కుమార్, ప్రాచీ, నాగ చైతన్య ముగ్గురు ఉండటం విశేషం. కానీ కొంత మంది మాత్రం వీరి మధ్య ఏదో ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక నాగచైతన్య థాంక్యూ సినిమా లో రాశికన్నా, అవికా గోర్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ సినిమా వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.



































