అక్కినేని చైతన్య, సమంతల గురించి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమాతో ప్రేమలో పడ్డ వీరిద్దరూ ఆ తరువాత పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత వీరిద్దరూ కలిసినటించిన సినిమా “మజిలీ”. బాక్సఫీస్ వద్ద ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఈ సినిమా తరువాత వీరిద్దరూ కలిసి సినిమాలో నటించలేదు. ఆ తరువాత “ఓ బేబీ” తో మంచి సక్సెస్ అందుకుంది. మరోవైపు నాగ చైతన్య కూడా వెంకటేష్ తో కలిసి ముల్టీస్టారర్ చిత్రం “వెంకిమామ” తో విజయాన్ని అందుకున్నాడు.

ప్రస్తుతం నాగ చైతన్య డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో “లవ్ స్టోరీ” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఫిదా ఫెమ్ సాయి పల్లవి ఈ సినిమాలో నాగ చైతన్య సరసన కధానాయికగా నటిస్తోంది. తాజాగా “ఏ పిల్ల…” అనే పాటను మర్చి 11న సాయంత్రం విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ సమంతకు గురించి ఒక ఆశక్తి కార విషయాన్నీ తెలిపారు.
Wishing you all a safe and happy holi! #AyPilla full lyrical on March 11th at 4:05pm @Sai_Pallavi92 @sekharkammula @Pawanch19 @AsianSunilN @SVCLLP #AmigosCreations @AdityaMusic #LoveStory #NC19 pic.twitter.com/hjoBPffgwe
— chaitanya akkineni (@chay_akkineni) March 10, 2020
సమంతకు “ఏ మాయ చేసావే” సినిమాలోని “ఈ హృదయం కరిగించి వెల్లకే…” అనే పాట చాలా ఇష్టమని చెప్పాడు. ఈ విషయాన్నీ సమంత కూడా ట్విట్టర్ వేదికగా అంగీకరించింది. ఈ నేపథ్యంలో చైతన్య తన ట్విటర్ అకౌంట్లో ఓక ట్వీట్ చేసాడు. మీకిష్టమైన పాట ఏంటి ? అని తన అభిమానులను అడిగాడు. తనకి మాత్రం సాహసం శ్వాసగా సాగిపో చిత్రంలో “వెళ్ళిపోమాకే…” పాట అంటే చాలా ఇస్తామని తెలిపాడు. అలాగే మీకిష్టమైన పాట ఏంటో చెప్పండి అని #myfavlovsong అనే టాగ్ కూడా ట్వీట్ లో పెట్టేసాడు. ఈ విషయంపై చైతు కు చాలా రిప్లైస్ వచ్చాయి.
One of my most favorite love songs ever is “Velipomaake” from Saahasam Swaasaga Saagipo.
— chaitanya akkineni (@chay_akkineni) March 9, 2020
Send me yours with #myfavlovesong
Get started!!
































