నాగ చైతన్య మురళీ మోహన్ ను ఇల్లు అడగడం ఏంటి..? అతను ఇవ్వడం కుదరదు అనడం ఏంటి ఇదెప్పుడు జరిగింది అనుకుంటున్నారా..? అవునండి… ఇప్పుడు సమంతతో కలిసి నాగ చైతన్య ఉంటున్న ఇల్లు మురళీ మోహన్ కట్టించుకున్నదే. ఆ ఇల్లు మురళీ మోహన్ దగ్గర్నుంచే చైతూ కొన్నాడు. ఇకపోతే అయితే దీని వెనక చాలా పెద్ద కథ ఉంది అండి. అదేమిటంటే పెళ్లి తర్వాత ప్రత్యేకంగా ఒక ఇల్లు తీసుకోవాలని తిరుగుతున్న సమయంలో చాలా ఇళ్లు చూసిన చైతూకు ఒక్కటి కూడా నచ్చలేదట. ఇక అలాంటి సమయంలో మురళీ మోహన్ ఇల్లు చూసాడు చైతు. అది ఆయనకు బాగా నచ్చి వెంటనే వెళ్లి అంకుల్ ఈ ఇల్లు నాకు కావాలని చైతూ అడిగేసాడు.

అయితే దీనికి మురళీ మోహన్ మాత్రం ఇది అమ్మడానికి కాదు బాబు.. తనకు, తన కొడుకు, తన తమ్ముడి కోసం ప్రత్యేకంగా కట్టుకున్నామని బదులు ఇచ్చాడు. అయితే ఇల్లు బాగా నచ్చడంతో వెంటనే ఇంటికి వెళ్లిన తరువాత చైతు నాగార్జునకు వారి విషయం చెప్పాడు. ఇక అంతే వెంటనే నాగార్జున రంగంలోకి దిగాడు. సిటీలో ఎన్నో ఇల్లు చూసిన చైతూకు మీ ఇల్లు మాత్రమే బాగా నచ్చింది.. ఓసారి చూడండి మురళీ మోహన్ గారూ అంటూ నాగార్జున చెప్పడంతో ఇక ఆయన కూడా మనసు మార్చుకున్నాడు. అక్కినేని నాగార్జున కుటుంబంతో తనకు చాలా మంచి అనుబంధం ఉందని.. ఇద్దరం కలిసి చాలా సినిమాలు కూడా చేసామని ఆయన మురళీ మోహన్ తెలిపారు.

చైతూ ఇష్టాన్ని కాదనలేక.. తన కొడుకు మరో ఇంట్లో చేరాడని.. దానితో తన కొడుకు కోసం కట్టిన ఫ్లాట్ ను చైతూకు ఇచ్చేసానని మురళీ మోహన్ చెప్పారు. ఆ ఫ్లాట్ 14వ ఫ్లోర్ లో పూర్తిగా సౌకర్యాలతో ఉండే ఆ ఇంటిని మనసు పడి మరీ కొనుక్కున్నాడు చైతూ. ఇకపోతే ప్రస్తుతం అక్కడే సమంతతో కలిసి జీవితం సాగిస్తున్నాడు నాగ చైతన్య. వారి ఇంటి పక్కనే ప్రస్తుతం మురళీ మోహన్, ఆయన తమ్ముడు కూడా ఉంటున్నారు. ఇక ఆ ఇంట్లోనే జిమ్, స్విమ్మింగ్ పూల్ అన్నీ కూడా ఉన్నాయి. ఇకపోతే మొత్తానికి తనకోసం కట్టుకున్న ఇంటిని నాగ చైతన్య వచ్చి అడగడంతో మురళీ మోహన్ దానికి కాదనడం, అంతలోనే నాగార్జున రంగంలోకి దిగి ఇప్పించడం అలా జరిగిపోయాయి.































