Naga Chaithanya ready to get second marriage: నాలుగేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ 2021 సంవత్సరం లో నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఏం మాయ చేశావే సినిమాతో మొదలు పెట్టిన వీళ్ళ ప్రేమ ప్రయాణం 2017 అక్టోబర్ లో పెళ్లి తో ఫుల్ పెట్టారు అనుకుంటే, విడాకులు తీసుకుని అందరినీ షాక్ కి గురి చేశారు. అయితే వీళ్ళు విడిపోవడానికి గల కారణాలు మాత్రం ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు.

విడాకుల తర్వాత ఇద్దరూ వారి వారి కెరియర్లో వరుస విజయాలతో బిజీగా ముందుకు వెళ్తున్నారు. పుష్ప సినిమా లోని ఐటమ్ సాంగ్ తో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న సమంత ప్రస్తుతం టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ లలో వరుస సినిమాలు చేస్తూ లైఫ్ ని బిజీగా గడిపేస్తోంది. సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది ఈ అమ్మడు. నాగచైతన్య కూడా విడాకుల తర్వాత వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్నాడు. లవ్ స్టోరీ, బంగార్రాజు వంటి హిట్ల తర్వాత వరుస సినిమాలు వెబ్ సిరీస్ లు ప్లాన్ చేసుకుంటున్నాడు.అయితే ప్రస్తుతం నాగ చైతన్య రెండో పెళ్లి గురించి వార్తలు వినిపిస్తున్నాయి.

రెండో పెళ్లికి సిద్దమవుతున్న నాగచైతన్య…
అక్కినేని నాగచైతన్య విడాకులు తర్వాత రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటే నిజం అనే అంటున్నాయి కొన్ని వర్గాలు. ప్రస్తుతం అక్కినేని నాగార్జున నాగచైతన్యకు రెండో పెళ్ళి చేయాలన్న పట్టుదలతో ఉన్నాడు అని సినీ వర్గాల టాక్. దీనికోసం సంబంధాల వేటలో కూడా ఉన్నాడట.ఈసారి బంధువుల ఇంట్లో నే ఒక అమ్మాయి ని చూడాలని ప్రయత్నాలు చేస్తున్నారట. నాగార్జున ప్రయత్నాలు త్వరలోనే ఫలిస్తాయి అన్న చర్చలు కూడా జరుగుతున్నాయి.

నాగార్జున కూడా నాగచైతన్య లాగానే మొదట విక్టరీ వెంకటేష్ సోదరిని పెళ్లి చేసుకొని తర్వాత విడాకులు తీసుకొని అమల ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అక్కినేని అఖిల్ కూడా ప్రేమించిన అమ్మాయి తో ఎంగేజ్మెంట్ కూడా చేసుకొని పాపం దానికి స్వస్తి చెప్పేశారు. అయితే సమంత మాత్రం రెండో పెళ్లి ఆలోచన లేకుండా కెరీర్ ను చక్కబెట్టుకునే పనిలో ఉంది.



























