Naga srinu vs Mohan Babu : మంచు మోహన్ బాబు కుటుంబం ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన కుటుంబంలో విష్ణు లక్ష్మి లను కూడా బాగా ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇక మోహన్ బాబు వ్యక్తిగత హెయిర్ డ్రెస్సెర్ నాగ శ్రీను తన ఇంట్లో దొంగతనం చేసాడని పోలీస్ కంప్లయింట్ ఇవ్వడం నాగ శ్రీను మీడియా ఆశ్రయించడంతో మరోసారి మంచు ఫ్యామిలీ వార్తల్లో నిలిచారు.మోహన్ బాబు పర్సనల్ హెయిర్ స్టైలిష్ట్‌గా 11 ఏళ్ల పాటు ఆ కుటుంబంలో ఒకరిగా తిరిగిన వ్యక్తి నాగశ్రీను. ఇక నాగ శ్రీను అసలు నేరం చేసాడో లేదో అనే కానీ, ఇద్దరు ఒకరిపై మరొకరు పరస్పరం తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు.

దయచేసి నన్ను బ్రతకనివ్వండి…..
జీ తెలుగు న్యూస్ ఛానల్ డిబేట్ పెట్టి మరీ అసలు సంగతి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తోంది.అయితే ఈ చర్చల్లో మోహన్ బాబుపై సంచలన కామెంట్స్ చేసారు. దొంగతనం చేసానని మోకాళ్ళపై కూర్చోబెట్టి శిక్షించారాని, ఇక నాగ శ్రీను తల్లి ని కూడా దూర్భాషలాడరని శ్రీను చెప్పారు. ఇక ఈ విషయాలు నాయి బ్రాహ్మణ సంఘ దృష్టికి వెళ్లాయి. నాగ శ్రీను కి మద్దతునిచ్చాయి.తమను, తమ కులాన్ని కించపరిచేలా వ్యవహరించే హక్కు మోహన్ బాబుకు ఎవరు ఇచ్చారంటూ నాయిబ్రాహ్మణ సంఘాలు పలు చోట్ల రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపాయి. మోహన్ బాబు కుటుంబానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాయి. మోహన్ బాబు తమకు క్షమాపణలు చెప్పకపోతే తమ నిరసనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఇక ఈ సంఘటనల తరువాత నాగ శ్రీను మరో సారి మీడియాను ఆశ్రయించారు. తనకు ఎక్కడ పని దొరకకుండా మంచు కుటుంబం అడ్డుకుంటోందని మీడియా కు తెలిపారు. “ నాపాటికి నన్ను బతకనివ్వండి’’ అంటూ నాగశ్రీను జీ న్యూస్ తెలుగు ద్వారా వేడుకుంటున్నాడు.






























