‘జబర్దస్త్’ అంటే కొన్ని రోజుల క్రితం టక్కున గుర్తుకు వచ్చే పేర్లలో ముఖ్యంగా నాగబాబు ఒకరు. ఈ షోకు ఆయనే పెద్ద ప్లస్. అతడి నవ్వే అద్దరినీ కట్టి పడేస్తుంది. జబర్దస్త్ లో చేసే టీం మెంబర్లకు కూడా.. తప్పొప్పులు చెబుతూ.. దగ్గరుండి ముందుకు నడిపించాడు. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల నాగబాబు జబర్దస్త్ నుంచి వెళ్లిపోయి.. జీ లో కొత్త కామెడీ షోకి శ్రీకారం చుట్టాడు.

అందులో జడ్జిగా వ్యవహరించాడు. ‘అదిరింది’ అనే కామెడీ షోని జీలో ప్రసారం చేశారు. అందులో కూడా సీనియర్ టీం లీడర్లు అయిన చమక్ చంద్ర, వేణు, ధన్ రాజ్ లాంటి వాళ్లు చేశారు. మళ్లీ ఆ షో కూడా కొన్ని కారణాల వల్ల నిలిపివేశారు. ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఈ సీజన్ వరకు ఇంతే.. మళ్లీ మరో సీజన్ మొదలవుతుంది అని చెప్పుకొచ్చారు.
ఏదేమైనా కొన్నాళ్ల వరకు బాగానే రన్ అయిన ‘అదిరింది’ షో నిలిపివేశారు. ఇక తర్వాత చాలా రోజుల వరకు గ్యాప్ తీసుకొని.. ఇప్పటికే మాలో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ షోలో ఎంట్రీ ఇచ్చాడు. అతడు ఈ షోకి జడ్జిగా వచ్చారు. కొన్ని రోజుల క్రితం వరకు షోకి శేఖర్ మాస్టర్ జడ్జిగా ఉండేవారు. తర్వాత ఏమైందో ఏమో గానీ.. గత రెండు, మూడు ఎపిసోడ్ల నుండి ఆయన రావడం లేదు.
శేఖర్ మాస్టార్ బహుషా కొరియోగ్రఫీలో బిజీ అయిపోయరేమో. అయితే ఆయన స్థానంలో అలీ వచ్చారు. ఇప్పుడు నాగబాబు ఫుల్ టైమ్ జడ్జిగా వచ్చారట. ఆయన ఎంట్రీలో శ్రీముఖి డైలాగ్‌తో ఈ విషయం తేలిపోయింది. అయితే ఎందుకు లేటు అనేది మాత్రం చెప్పలేదు. అయితే ఇప్పుడు నాగబాబు రాకతో ఈ షో ఎంత వరకు ఆకట్టుకుంటుదో చూడాలి.





























