Niharika : హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్ లోని ఫూడింగ్ పబ్ సమయానికి మించి రాత్రి నడపడంతో పోలీసులు దాడి నిర్వహించారు. ఇక ఈ దాడి లో దాదాపు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అయితే తొలుత ప్రముఖ టాలీవుడ్ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ అరెస్ట్ వార్త బయటికి వచ్చింది. ఇక సమయం గడిచే కొద్దీ ప్రముఖుల పిల్లల పేర్లు బాగానే వినిపిస్తున్నాయి. ఇక మెగా ఫ్యామిలీ నుండి నాగబాబు కూతురు నిహారిక కొణిదెల కూడా అరెస్ట్ అయినట్లు వార్తలు వచ్చాయి.

తాజగా ఈ వార్తలపై నాగబాబు స్పందించారు. ఆ సమయంలో నిహారిక అక్కడ ఉండటం నిజమేనని కన్ఫాం చేసిన నాగబాబు. అయితే పబ్ పరిమిత సమయాన్ని మించి రన్ చేస్తున్న కారణంగా పోలీసులు పబ్ పై యాక్షన్ తీసుకున్నారని, అంతకు మించి వేరే ఏమీ లేదని.. తన కూతురు నిహారిక ఎటువంటి తప్పు చేయలేదని స్పష్టం చేసారు. దీనిపై సోషల్ మీడియాలో, మీడియాలో స్పెక్యులేషన్స్ ప్రచారం చేయోద్దనే ఉద్దేశ్యంతో ఈ విడియో ద్వారా క్లారిటీ ఇస్తున్నట్టుగా తెలిపారు.
































