Nagababu happy about Roja not in jabardasth: నాగబాబు జబర్దస్త్ ను 2019లో వీడారు. రెమ్యూనరేషన్ విషయంలో ఏవో తేడాలు రావడంతో ఆయన జబర్దస్త్ నుండి వీడారని అప్పట్లో వినిపించింది. జబర్దస్త్ డైరెక్టర్స్ ను తీసుకుని చమ్మక్ చంద్ర వంటి స్టార్ కమెడియన్స్ ను తీసుకుని జబర్దస్త్ నుండి వెళ్లిపోయారు. మొదట జీ తెలుగులో అదిరింది అంటూ వచ్చినా షో హిట్ అవ్వకపోవడంతో మళ్ళీ మా టీవిలోకి వచ్చారు అయిన ఆయన జబర్దస్త్ పి కోపం మాత్రం పోలేదట. షో కు పోటీగా మా టీవీ షోని ప్రిపేర్ చేస్తున్న జబర్దస్త్ కు ఉన్నా ఇమేజ్ వల్ల ఆది, సుధీర్ వంటి ఇద్దరు బలమైన కంటెస్టెంట్స్ ఉండటం వల్ల జబర్దస్త్ రేటింగ్స్ తగ్గలేదు. ఇక రోజా టైమింగ్ పంచులకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. దీంతో జబర్దస్త్ ఎక్కడ తగ్గడం లేదు.

రోజా లేకపోవడం జబర్దస్త్ ను డౌన్ చేస్తుందా….
టీవీ లో వచ్చే ఏ రియాలిటీ షో లేశ కార్యక్రమం అయిన ఒక రేంజ్ కి వెళ్ళాక మళ్ళీ పతనం అవ్వడం తప్పదు. ఇపుడు జబర్దస్త్ కూడా అలాంటి పరిస్థితిలో ఉందని అనిపిస్తుంది. దాదాపుగా 10ఏళ్ళు టెలివిజన్ టీఆర్పి రేటింగ్స్ లో రారాజుగా ఉన్నా జబర్దస్త్ ప్రస్తుతం కామెడీలో కొత్తదనం లేక పక్కన ఛానెల్స్ పోటి వల్ల మసకబారుతోంది. ఇక గోరుచుట్టు పై రోకలి పోటులాగా రోజా జబర్దస్త్ ను వీడడం మరో దెబ్బగా అనుకుంటున్నారు ప్రేక్షకులు.

ఇక ఇపుడు నాగబాబుకి జబర్దస్త్ పై పగ తీర్చుకునే అవకాశం లభించిందని అందరు భావిస్తున్నారు. అయితే జడ్జెస్ పోయినంత మాత్రాన జబర్దస్త్ ఆగిపోతుందంటే అది కష్టమే. జబర్దస్త్ లో ఇంకా మూల స్థంబాల్లాంటి టీం లీడర్స్ సుధీర్, ఆది, రాఘవ, బుల్లెట్ భాస్కర్ వంటి వాయు ఉన్నారు. కాబట్టి జబర్దస్త్ కొత్తగా మారుతుందే తప్ప మసకబారదనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. కానీ జబర్దస్త్ మాత్రం ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చింది. ఇందులో మొదట నాగబాబు, రోజా ల పేర్లే ఉంటాయి. వాళ్లు కెరీర్ లో స్లో గా ఉన్నపుడు జబర్దస్త్ మళ్ళీ వాయికి మంచి అవకాశం ఇచ్చింది. ఇపుడు కూడా మళ్ళీ కొత్త వాళ్లకు మళ్ళీ మంచి అవకాశాన్ని ఇస్తుందనడంలో ఏమి సందేహం లేదు.

































