ఏమాటకామాటే చెప్పుకోవాలి.. నాగబాబుకి కాస్త వెటకారం పాళ్లు ఎక్కువే… జబర్దస్త్ లో చేరిన తర్వాత అది మరింత ఎక్కువైంది. అయన పైకి కనిపించేంత సీరియస్ పర్సన్ కాదని అందరికి తెలిసేలా చేసింది జబర్దస్త్ షో.. ఈ షో టిఆర్పీ రేంగ్ ల పరంగా సృష్టించిన సంచలనం ఒక ఎత్తైతే, ఆ షో ద్వారా వెలుగులోకి వచ్చిన కళాకారులకు ఎందరికో బంగారు భవిష్యత్తు ఇచ్చిన వైనం మరో ఎత్తు.. ఈ షో ద్వారా నాగబాబుకు బుల్లి తెరపై సూపర్ క్రేజ్ వచ్చిన విషయం తెలిసిందే.. అయితే ఆ తరువాత అయన ఈ షో ను వదిలి వెళ్లిపోయారు… వెళ్లి వెళ్ళగానే జీ తెలుగులో “అదిరింది” అనే షో ను మొదలు పెట్టారు.

అయితే జి తెలుగులో వస్తున్న మరో ప్రోగ్రామ్ “లోకల్ గ్యాంగ్స్” లో ఆ మధ్యలో అయన ప్రేమ కధ చెప్పారు మెగా బ్రదర్. ఆ షోలో యాంకర్ ప్రదీప్ “సార్… మీరు ఎవరినైనా ప్రేమించారా? మీ లవ్ స్టోరీ చెప్పండి సార్ అంటూ…” అడిగిన వెంటనే అవును ప్రేమించాను అంటూ తన లవ్ స్టోరీ చెప్పాడు నాగబాబు. “ఒకరిద్దరు కాదు… ఏకంగా 9 మందికి ప్రపోజ్ చేశాను…. అందరు ఛీ కొట్టారు” అంటూ చెప్పాడు ఈ మెగా బ్రదర్… మనదంతా వన్ సేడ్ లవ్ స్టోరీ అంటూ చెప్పుకొచ్చాడు నాగబాబు… అయన సమాధానం విన్న షో లోని వారంతా నవ్వుకున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ లేకపోవడంతో “అదిరింది” మరియు జబర్దస్త్ కమెడియన్స్ కు వీడియో కాల్స్ చేసి మాట్లాడుతున్నారట ఈ మెగా సోదరుడు…




























