Nagachaitanya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని హీరోగా మంచి సక్సెస్ అందుకున్న వారిలో నాగచైతన్య ఒకరు. నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగచైతన్య ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటీవల ఈయన నటి శోభితను రెండవ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 4వ తేదీ 2024వ సంవత్సరంలో వీరి వివాహం అది కొద్ది మంది ప్రముఖులు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది.

ఇలా నాగచైతన్య శోభిత పెళ్లి గురించి అప్పట్లో ఎన్నో రకాల వార్తలు వినిపించాయి అయితే తాజాగా వీరి పెళ్లికి సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాగచైతన్య శోభిత పెళ్లి డాక్యుమెంటరీను నెట్ ఫ్లిక్స్ వారు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే త్వరలోనే వీరి పెళ్లి వీడియో నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కాబోతుందని తెలుస్తోంది.
ఫిబ్రవరి 14వ తేదీ వాలెంటైన్స్ డే కావడంతో అదే రోజున వీరి పెళ్లి డాక్యుమెంటరీ కూడా విడుదల చేయబోతున్నట్టు సమాచారం అయితే ఈ పెళ్లి డాక్యుమెంటరీని నెట్ ఫ్లిక్స్ వారు 50 కోట్లకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇలా వీరు పెళ్లి డాక్యుమెంటరీని నెట్ ఫ్లిక్స్ఇవ్వటంతోనే వీరి పెళ్లికి కూడా పెద్దగా సెలబ్రెటీలు హాజరు కాలేదని, అతి కొద్దిమంది సమక్షంలో మాత్రమే ఈ వేడుక జరిగిందని తెలుస్తోంది. మరి వీరి పెళ్లి డాక్యుమెంటరీ గురించి వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజముంది అనేది తెలియాల్సి ఉంది.
ఇక నాగచైతన్య మొదట సమంతను వివాహం చేసుకున్నారు. సమంతతో విడాకులు తీసుకోని విడిపోయిన తరువాత నాగచైతన్య తిరిగి శోభితను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసింది. ఇక ప్రస్తుతం నాగచైతన్య తండేల్ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ బిజీగా గడుపుతున్నారు.



























