Nagarjuna: అక్కినేని నాగార్జున టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నటువంటి ఈయన ఈ మధ్యకాలంలో సినిమాలను కాస్త తగ్గించాలని చెప్పాలి. ఘోస్ట్ సినిమా ద్వారా చివరిగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి నాగార్జున అనంతరం ఎలాంటి సినిమాలను ప్రకటించలేదు దీంతో ఈయన నుంచి ఎలాంటి సినిమా అప్డేట్స్ రాకపోవడంతో అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరిస్తున్నటువంటి నాగార్జున ఈ కార్యక్రమాల ద్వారా అభిమానులను సందడి చేస్తున్నారు. అయితే త్వరలోనే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధమయ్యారు. ఇదిలా ఉండగా తాజాగా నాగార్జున బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహెల్ నటించిన మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన అమల ప్రెగ్నెన్సీ సమయం గురించి గుర్తు చేసుకుంటూ పలు విషయాలను తెలియజేశారు. అమల ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో నేను హలో బ్రదర్ సినిమాలో నటిస్తున్నాను ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే 6 నెలలపాటు ఎలాంటి సినిమాలలో నటించలేదు. ఈ ఆరు నెలల పాటు అమలకు దగ్గరగా ఉంటూ తన అన్ని అవసరాలను తీర్చానని తెలిపారు.

Nagarjuna: అద్భుతమైన క్షణాలు…
ఇక అమల డెలివరీ సమయంలో తాను తన పక్కనే ఉన్నానని అలా ఒక మనిషి జన్మించడం ఒక అద్భుతం అంటూ నాగార్జున ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.అయితే అఖిల్ పుట్టిన తర్వాత నేను ఆరు నెలల పాటు వారిద్దరికీ దగ్గరగా ఉన్నటువంటి ఆ క్షణాలు నా జీవితంలో ఎప్పటికీ ఓ మధురమైన క్షణాలే అంటూ నాగార్జున ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.





























