Nagarjuna : నాగార్జున కెరీర్ లో చాలా పెద్ద హిట్ సినిమాలు ఉండొచ్చు కానీ నటన పరంగా నాగార్జున సినిమాలో ది బెస్ట్ సినిమా అంటే అన్నమయ్య. కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున అన్నమయ్యగా సుమన్ వెంకటేశ్వర స్వామి పాత్రలో నటించిన ఈ అద్భుత కావ్యం అప్పటి ప్రేక్షకులనే కాదు ఇప్పటికీ టీవీలో వచ్చి అందరిని అలరిస్తోంది. ఇక ఈ సినిమా వచ్చి 22 ఏళ్ళు దాటినా ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు వినపడుతూనే ఉన్నాయి.

గుడి కట్టించిన అభిమానం……
ఇక ఈ సినిమా ఒక మాస్ హిట్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. క్లాస్ మాస్ అని తేడా లేకుండా ఆబాలగోపాలన్నీ అలరించింది ఈ సినిమా. ఈ సినిమా విజయంతో నాగార్జున మరోసారి భక్తుల పాత్రలనే చేసారు. భక్త రామదాసు వంటి వాటిని చేసారు. హీరోలకు అభిమానులు ఉంటారు. వారికోసం పుట్టినరోజులకు రక్తదానాలు, సామజిక సేవలు మాములే. మరింత అభిమానం ఎక్కువైతే గుళ్ళు కడతారు. ఇలా తమిళనాడులో జరిగింది. హీరోయిన్ ఖుష్బు, నమిత, నిధి అగర్వాల్ లకు గుళ్ళు కట్టి అభిమానం చాటుకున్నారు వారి అభిమానులు. అయితే ఇపుడు ఒక నాగార్జున అభిమాని 22 ఏళ్ళు కష్టపడి అన్నమయ్య గుడి కట్టాడు.

నాగార్జునకు వీరాభిమాని అయిన సుధాకర్ అనే గుంటూరుకి చెందిన అభిమాని నాగార్జున సినిమాను థియేటర్లో ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటం అలవాటు. అలానే 1977 లో విడుదలైన అన్నమయ్య సినిమాను చూసి ముగ్ధుడైనా సుధాకర్ గుడి కట్టించాలని నిర్ణయించుకున్నాడు. 1977 లోనే గుడికి పునాది వేసిన సుధాకర్ ఆర్ధిక ఇబ్బందులవల్ల గుడి నిర్మాణం ఆలస్యమైంది. గుడి పూర్తవడానికి దాదాపు 22 ఏళ్ళు పట్టింది ఇక దాదాపుగా 1కోటి 30 లక్షలు గుడి నిర్మాణానికి ఖర్చు చేసాడు. తన హీరోపై అభిమానాన్ని చూపడానికి 22 ఏళ్ళు కష్టపడ్డాడు సుధాకర్. ప్రస్తుతం ఈ గుడికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అలాగే అక్కినేని అభిమానులకు ఆనందాన్ని ఇస్తోంది.
Sudhakarswamy cult fan of @iamnagarjuna From Guntur after He watched #Annamayya decided to build a #AnnamayyaTemple
— Akhil Gaddam (@Akhilgaddam16) May 24, 2022
He led the stone for temple in 1997 after almost 22 years facing many hurdles with the expenditure of 1 crore 30 lakhs He built the temple recently ????
Nag impact???? pic.twitter.com/RkIaY6ZVef































