న‌గ్నం హీరోయిన్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా.? (వర్మా.. ఏంటీ ఖర్మ.?)

0
348

క‌రోనా దెబ్బ‌తో దేశం మొత్తం ప్రాణ భయంతో గడగడలాడుతుండగా.. కరోనాకే కిర్రేక్కించే విధంగా డైరెక్టర్ రామ్ గోపాల్ వ‌ర్మ మాత్రం తన పంధాను మార్చుకుని కొత్త త‌ర‌హాలో వరుసగా సినిమాల్ని విడుదల చేస్తూ సంచ‌ల‌నం సృష్టిస్తున్నారు.

లో బ‌డ్జెట్‌ తో సినిమాలు నిర్మిస్తూ భారీ స్థాయిలో లాభాలను ద‌క్కించుకునే చవకబారు ప్రయత్నంలో భాగంగా గతంలో పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో క్లైమాక్స్‌ అనే బీ గ్రేడ్ చిత్రాన్ని విడుదల చేసిన రామ్ గోపాల్ వ‌ర్మ తాజాగా న ‌గ్నం పేరుతో మ‌రో షార్ట్ ఫిల్మ్ లాంటి బూతు చిత్రాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆర్జీవీ వ‌ర‌ల్డ్ థియేట‌ర్ పేరుతో కొత్త యాప్‌ని సృష్టించిన వ‌ర్మ ఈ యాప్‌ లో వ‌రుసగా తన సినిమాల్ని విడుదల చేస్తూ సోషల్ మీడియాలో సంచ‌ల‌నం సృష్టిస్తున్నారు. ఇటీవలే విడుదలైన న‌ గ్నం చిత్రాన్ని చూడాలంటే అక్షరాలా 200 చెల్లించాలనే లాజిక్ వ‌ర్మ మేధస్సుకు నిదర్శనమని చెప్పాలి. ఈ చిత్రం విడుదలైన తర్వాత రామ్ గోపాల్ వర్మ మీడియాతో ల‌క్ష బ‌డ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రానికిగానూ ఇప్పటి వరకూ 70 ల‌క్ష‌లు లాభం పొందాన‌ని చెప్పి నెటిజన్లందరికీ షాక్ ఇచ్చారు.

ఇక అసలు విషయానికి వస్తే.. యూత్ ని టార్గెట్ చేస్తూ రూపొందించిన న ‌గ్నం చిత్రం ద్వారా పశ్చిమ గోదావ‌రి జిల్లా దేవ‌ర ప‌ల్లికి చెందిన స్వీటీ అనే అమ్మాయి ప‌రిచ‌య‌మైంది. ఈ చిత్రంలో న‌టించినందుకు గానూ స్వీటీకి రామ్ గోపాల్ వ‌ర్మ ఇచ్చిన పారితోషికం అక్ష‌రాలా 2 ల‌క్ష‌లు అని స్వ‌యంగా స్వీటీయే చెప్పడంతో సోషల్ మీడియాలో వ‌ర్మ చెప్పిందంతా కేవలం ప‌బ్లిసిటీ స్టంట్ అని తేలిపోయింది. అదండి సంగతి.. చవకబారు సినిమాలు తీయడమెందుకు.. దిగజారిపోయేవిధంగా చీప్ పబ్లిసిటీ చేసుకోవడమెందుకు చెప్మా..? వర్మా.. ఏంటి ఈ ఖర్మ..?!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here