టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లో కూడా కింగే అని నిరూపించుకున్నారు
కింగ్ నాగార్జున ఆస్తులు భారీగా పెరిగినట్లు తాజా సమాచారం. అటు సినిమాల ద్వారా, ఇటు బుల్లితెర షోలు చేస్తూ.. మరోప్రక్క ప్రకటనల్లో నటిస్తూ గట్టిగానే సంపాదిస్తున్నాడు.

ఇటీవలే వెలువడిన ‘జూమ్ టీవీ’ కథనం ప్రకారం సక్సెస్ ఫుల్ బిజినెస్ పర్సన్ గా నాగార్జునకు రూ.850 కోట్ల ఆస్తులున్నాయని వార్త వెలుగులోకి వచ్చింది. క్రిందటి సంవత్సరం బిగ్‌బాస్ 3 హోస్ట్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగ్ అంతకు ముందు కూడా మీలో కోటీశ్వరుడు ఎవరు.? అనే ప్రోగ్రామ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఈ రియాలిటీ షోస్‌లో నటించినందుకు గానూ నాగార్జునకు స్టార్ మా భారీగానే పారితోషకం ఇచ్చిందని మీడియా సమాచారం. ఓ ప్రక్క సినిమాలలో, మరో ప్రక్క వ్యాపార ప్రకటనల్లో నటించినందుకుగానూ తీసుకునే పారితోషికంతోపాటు నాగ్‌కు చెందిన భవన నిర్మాణ సంస్థ ద్వారా కూడా మంచి ఆదాయం లభిస్తోంది.

నాగార్జున ఏటా రూ.30 కోట్లు సంపాదిస్తున్నట్లు సమాచారం. ఈవిధంగా నాగార్జున ఆస్తులు ఒక్కసారిగా పెరిగి చేతినిండా సొమ్ములుండటంతో నాగార్జున ఈమధ్యనే తనకోసమని సొంత చార్టెట్ ఫ్లైట్‌ను కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుగు సినీరంగ ప్రముఖుల ద్వారా తెలిసింది. అలాగే నాగార్జన ఈఫ్లైట్ ను తాను ఉపయోగించని సందర్భాల్లో ఈ ఛార్టెట్ ఫ్లైట్‌ను అద్దెకు ఇచ్చే ఆలోచనలో కూడా ఉన్నట్టు సమాచారం. ఏదేమైనా దాదాపుగా 3 దశాబ్దాల నుండి వెండితెరపై హీరోగా రాణిస్తూ.. అటు ఆస్తులను, ఇటు వ్యాపార సంస్థలను విజయవంతంగా నడిపించడం అంటే సాధారణ విషయం కానే కాదు. కానీ అన్నిటికన్నా గొప్ప విషయమేమిటంటే.. ఇన్ని టెన్షన్లు వున్న మన మన్మథుడు మాత్రం నిత్యం చిరునవ్వులు చిందిస్తూ సరదాగానే కనిపిస్తుంటారు. సక్సెస్ ఫుల్ పర్సన్స్ లైఫ్ సీక్రెట్స్ లో చెరగని చిరునవ్వు కూడా ఒక సీక్రెటేనేమో.!



























