కరోనా వైరస్ విజృంభణ వల్ల ప్రజల జీవన విధానం, ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. దేశంలో చాలామంది వర్క్ ఫ్రమ్ హోం ఆప్షన్ ద్వారా ఇంటికే పరిమితమై ఇంటి నుంచి పని చేస్తున్నారు. అయితే నగరాల్లో ఉండటం వల్ల పెళ్లి కాని వాళ్లు బాగానే వేతనం సంపాదిస్తున్నా ఇంటి పనులు చేసుకోవడం కష్టమవుతోంది. ఇలా ఇంటి పని కోసం పనివాళ్లను వెతికే వాళ్లకు ఒక కంపెనీ విచిత్రమైన ఆఫర్ ను ప్రకటించింది.

ఇప్పటికే లెక్కకు మించి క్లీనింగ్ కంపెనీలు ఉన్నా ఏ కంపెనీ ఇవ్వని విధంగా ఇంగ్లండ్ లోని ఫ్లై మౌత్ లో ఉన్న నాక్డ్ క్లీనింగ్ కంపెనీ షాకింగ్ ఆఫర్ ప్రకటించింది. కంపెనీ ప్రకటించిన ఆఫర్ ప్రకారం మహిళా క్లీనింగ్ వర్కర్లు టాప్ లెస్ గా లేదా లింజరీని ధరించి పని చేస్తారు. ప్రస్తుతం ఈ కంపెనీ బ్రిటన్ లో సేవలు అందిస్తుండగా ఆ కంపెనీ డైరెక్టర్లు అతి త్వరలో ప్రపంచవ్యాప్తంగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు.
ఈ కంపెనీ ఫ్రాంఛైజీ మోడల్స్ తో క్లీనింగ్, వంట పనులు చేయిస్తుంది. అయితే సాధారణంగా క్లీనింగ్ వర్కర్లతో పని చేస్తే చెల్లించే డబ్బుల కంటే వీళ్లకు చాలా ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. నాక్డ్ క్లీనింగ్ కంపెనీ మొదట ఆయా దేశ ప్రభుత్వాల నుంచి ఇబ్బందులు తలెత్తని దేశాల్లో ఈ సేవలను మొదట ప్రారంభించనుంది. అయితే కంపెనీ చేసిన ప్రకటన వివాదాస్పదమవుతోంది. కంపెనీ డైరెక్టర్లు చాలా మంది తమ ఆఫర్ ను తప్పుగా భావిస్తున్నారని కానీ ఈ ఆఫర్ వల్ల మహిళా సాధికారత పెరుగుతుందని వాళ్లు చెబుతున్నారు.
తమ కంపెనీ మహిళలతో నగ్నంగా పని చేయిస్తోందే తప్ప వారి శరీరానికి, కొలతలకు సంబంధించిన సమాచారం ఇవ్వడం లేదని.. పూర్తి నగ్నంగా క్లీన్ చెయ్యాలంటే గంటకు 8,500 రూపాయలు, టాప్ లెస్ క్లీనర్లకు గంటకు 6,700 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అయితే కంపెనీ ప్రకటన సోషల్ మీడియాలో వివాదాస్పదం అవుతుండగా నెటిజన్లు కంపెనీని తీవ్రంగా ట్రోల్ చేస్తూ ఉండటం గమనార్హం.
sorry, the naked cleaning co., but that's not really how trademarks workhttps://t.co/b6S2akgz7k pic.twitter.com/nesMBh8WGE
— alexandra j. roberts (@lexlanham) December 14, 2020



























