వెన్నుపోటా.. గాడిద గుడ్డా.? అంటూ చంద్రబాబు కోసం కామెంట్ చేసి సంచలనం సృష్టించిన బాలయ్య !!

0
355

ఈమధ్య వివాదాలకు కేరాఫ్ అడ్రస్సుగా మారిన టాలీవుడ్ లెజెండ్ బాలయ్య మరోసారి సోషల్ మీడియాను షేక్ చేశారు. ఈసారి ఏకంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సీనియర్ ఎన్టీఆర్ ల వెన్నుపోటు అంశంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

నందమూరి తారక రామారావు నుండి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ పగ్గాలను ఎలా తీసుకున్నాడు అనడిగితే.. చాలా మంది చెప్పే సమాధానం వెన్నుపోటు. అందుకే చంద్రబాబువి వెన్నుపోటు రాజకీయాలంటారు చాలా మంది. నందమూరి కుటుంబ సభ్యులను అడ్డం పెట్టుకొనే ఆయన ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచారని అంటారు ప్రత్యర్ధులు. గతంలో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు చాలాసార్లు గెలచారు, ముఖ్యమంత్రి అయ్యారు. అయినా ఆయనపై పడిన వెన్నుపోటు మచ్చ మాత్రం పోలేదు. ఇదిలావుండగా తాజాగా తన షష్ఠి పూర్తి సందర్భంగా నందమూరి బాలకృష్ణ ఓ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆ మీడియా ప్రతినిధి చంద్రబాబు వెన్నుపోటు గురించి అడగ్గానే.. “వెన్నుపోటా.. గాడిద గుడ్డా.? చంద్రబాబు గురించి కొంత మంది ఏవేవో గాసిప్స్ మాట్లాడుతుంటారని అవి తనకు అర్థం కావని ఇప్పటి పరిస్థితిని బట్టి అందరం కలిసి పార్టీని కాపాడుకుంటూనే వస్తున్నామని అందులో తన పాత్ర కూడా వుందని.. అందుకే మళ్ళీ అధికారంలోకి కూడా వచ్చామని తనదైన బాణీలో చెప్పుకొచ్చారు బాలకృష్ణ. 😀😀😀

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here