బుల్లితెరపై ఏ షోకి రానంత రేటింగ్ జబర్దస్త్ షోకి వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా కూడా సోషల్ మీడియా ద్వారా, ఆన్లైన్ లో, యూట్యూబ్ ఛానల్ లో ఈ షో చూసే వారి సంఖ్య భారీగానే ఉంటుంది. ఇందులో ఆది స్కిట్ లు, పంచ్ డైలాగ్స్ కోసం చూసేవారు ఎక్కువ. అందులో హైపర్ ఆది అంటే తెలియనివారు ఉండరు. మారుతున్న ట్రెండ్ కనుగుణంగా ఫ్యాన్స్ బలహీనతలతో ఆడుకోవడం హైపర్ ఆదికి తెలిసినంతగా ఎవరికీ తెలియదేమో.!.

ఇక అసలు విషయానికి వస్తే కరోనా లాక్ డౌన్ సందర్భంగా ఈమధ్య జబర్దస్త్ షోలో ఒరిజినల్ కంటెంట్ బయటికి వస్తుంది. లేటెస్ట్ గా ఈషోలో భిన్నమైన స్కిట్స్ తో చెలరేగి పోతున్నాడు హైపర్ ఆది. ఈయన నటించే స్కిట్స్ షూటింగ్ కూడా నాన్ స్టాప్‌గా జరుగుతుండటంతో వరుస పెట్టి ప్రోమోలు రిలీజ్ అవుతూనే వున్నాయి. ఒకేరోజు 4 ఎపిసోడ్స్ షూట్ చేసినట్లుగా తెలిసింది. ఇదిలా ఉండగా ఈమధ్య మొదలైన ఎపిసోడ్ లో బాలయ్యను బాగానే వాడేసుకున్నాడు హైపర్ ఆది. గతంలోనే కూడా చాలాసార్లు తను నటించే స్కిట్స్ లో బాలయ్య డైలాగులను తనకు నచ్చినట్లుగా మార్చుకుని వాడేసుకున్నాడు. ఇదే విషయంపై గతంలో బాలయ్య ఫ్యాన్స్ నుంచి హైపర్ ఆదికి వార్నింగులు కూడా వచ్చాయన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మొదలైన జబర్దస్త్ షో లో మళ్లీ బాలయ్య డైలాగ్స్ ను వాడేసుకుంటున్నాడు ఆది.

లేటెస్ట్ ఎపిసోడ్ లో బోయపాటి శ్రీను చిత్రంలోని బాలయ్య బర్త్ డే డైలాగ్ తన స్కిట్ కోసం వాడేసుకున్నాడు హైపర్ ఆది. ”ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో.. ఆది గారికి మా జంటను చూస్తే కుళ్లులా ఉంది అనడానికి.. ఆది గారు మా కుళ్లిన జంట ఎలా ఉందనడానికి చాలా తేడా ఉందిరా లక్డీ కపూల్” అంటూ ఆది బాలయ్య మేనరిజంతో పంచ్ వేస్తూ.. బాలయ్య తనదైన స్టైల్ లో చెప్పిన డైలాగ్‌ను తన స్కిట్‌లో కామెడీగా వాడేసుకున్నాడు హైపర్ ఆది. అలాగే లెజెండ్ ఇంటర్వెల్ సీన్ ను కూడా దించేసాడు హైపర్ ఆది. ఈ స్కిట్ చూడటానికి నవ్వు పుట్టించినా మళ్లీ మళ్లీ బాలయ్యను టార్గెట్ చేస్తే మాత్రం నీకు చుక్కలు చూపిస్తాం అంటూ బాలయ్య ఫ్యాన్స్ హైపర్ ఆదికి వార్నింగ్ ఇచ్చారు.



























