Balayya-Mokshagna: ఈ సంక్రాంతి నందమూరి బాలకృష్ణ ది అని చెప్పవచ్చు. ఓవైపు బాలకృష్ణ నటించిన ‘అఖండ’ మూవీ బంపర్ హిట్ కొట్టింది. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండ మూవీ బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కరోనా తర్వాత సినిమా థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా..? రారా..? అని ఎదురు చూస్తున్న తరుణంలో బాలయ్య అఖండ ప్రేక్షకులను థియేటర్లకు క్యూ కట్టేలా చేసింది.

మరోవైపు ఆహలో స్ట్రీమింగ్ అవుతున్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షో సక్సెస్ అయింది. ఇండియాలో టాప్ టెన్ టాప్ షోలలో ఒకటిగా నిలవడం బాలకృష్ణ ఉత్సాహాన్ని మరింత పెంచింది. తాజాగా సంక్రాంతి సంబరాలు హాట్ టాపిక్ గా మారారు బాలయ్య బాబు. తన చెల్లెలు పురంధరేశ్వరి ఇంటికి వచ్చి సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు.

కారంచేడులో బాలయ్య రాకతో సందడి నెలకొంది. అందుకు ప్రధాన కారణం దగ్గుబాటి, నందమూరి కుటుంబాల కలయికే. ఈ రెండు కుటుంబాలు ఒకే చోట చేరడం తో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ప్రేక్షకుల ముందుకు రావడంతో ఫ్యాన్స్ ఉత్సాహం మరింత రెట్టింపయ్యింది.
గుర్రమెక్కి కుటుంబ సభ్యులను అలరించిన మోక్షజ్ఞ ..
గతంలో కాస్తంత లావుగా ఉన్న మోక్షజ్ఞ ప్రస్తుతం స్లిమ్ అయ్యాడు. మోక్షజ్ఞ చూసిన నందమూరి ఫ్యాన్స్ తమ అభిమాన హీరో నట వారసుడు త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పై అడుగు పెడుతున్నాడంటూ… తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికే సీనియర్ ఎన్టీఆర్ నట వారసుడిగా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ సిల్వర్ స్క్రీన్ ఏలుతున్నారు. ఇదిలా ఉంటే సంక్రాంతి సంబరాల్లో భాగంగా బాలయ్య నాచ్ ఘోడ గుర్రమెక్కి కుటుంబ సభ్యులను అలరించాడు. దీన్ని చూసేందుకు ప్రజలంతా ఎంతో ఆసక్తి కనబరిచారు. బాలయ్య విన్యాసాలు చూసేందుకు భారీగా ఫ్యాన్స్ వచ్చారు. తండ్రితో పాటు మోక్షజ్ఞ కూడా గుర్రపు స్వారీ చేస్తుంటే అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. మోక్షజ్ఞ నిజంగా తెరపైన చూస్తున్నంత ఆనందంగా ఫ్యాన్స్ తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. త్వరలోనే మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఉంటుందని ఫాన్స్ అనుకుంటున్నారు. ఇక సంక్రాంతి సందర్భంగా బాలయ్య ని చూసిన అభిమానులు జై బాలయ్య.. జై జై బాలయ్య అంటూ నినాదాలతో హోరెత్తించారు































