నందమూరి నటసింహం బాలకృష్ణ అయన వారసుడు నందమూరి మోక్షజ్ఞని తెలుగు తెరకు పరిచయం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. దాదాపు రెండు మూడేళ్లుగా బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీపై వార్తలు వినిపిస్తున్నాయి. ఒక దశలో బాలయ్య కూడా మరో ఏడాదిలో మోక్షజ్ఞ ఎంట్రీ కన్‌ఫర్మ్ అంటూ అభిమానులను ఊరించాడు. నందమూరి అభిమానులంతా మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. అయితే మొన్నామధ్య ఆయనకి సంబందించిన ఫోటో ఒకటి బయటకి వచ్చింది. అందులో చాలా లావుగా ఉన్న మోక్షజ్ఞ ని చూసిన అభిమానులందరూ షాక్ అయ్యారు. ఆ లుక్ చుసిన వారందరు ఆయనకు హీరోగా నటించడానికి సిద్ధంగా లేడని, మోక్షజ్ఞ కు యాక్టింగ్ పై పెద్దగా ఆసక్తి లేదని, సినిమాల్లో నటించే ఆలోచన లేదని భావించారు.
అయితే తాజాగా నందమూరి మోక్షజ్ఞకు నటనలో శిక్షణ ఇప్పించడం కోసం అయన కుటుంబ సభ్యులంతా న్యూయార్క్ పంపించారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. “న్యూయార్క్ ఫిలిం అండ్ థియేటర్ ఇనిస్టిట్యూట్” లో శిక్షణకు పంపారట. ఇంతకు ముందు కూడా చాలా మంది స్టార్ హీరోల పిల్లలు ఇక్కడ నటనలో శిక్షణ పోయిందిన విషయం తెలిసిందే. ఈ శిక్షణ మొత్తం 12 వారాలపాటు ఉంటుందట. ఈ 12 వరాల కోర్సు పూర్తీ చేసుకుని మోక్షజ్ఞ తిరిగి వస్తాడని, అయన తిరిగి వచ్చిన తరువాత నందమూరి అభిమానుల ఆశ తీరబోతోందని అనుకుంటున్నారు. యాక్టింగ్ కోర్సు పూర్తీ అయిన తరువాత నటించబోయే సినిమాల కోసం కసరత్తు మొదలయిందని ఫిలింనగర్ వర్గాల సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది.































