సినిమాల్లో పెర్ఫెక్షన్ కోసం, కొన్ని సన్నివేశాలు సహజంగా రావడం కోసం ఎంతగానో కష్టపడుతుంటారు నటీనటులు. తాజాగా టాలీవుడ్ నటి నందినీ రాయ్ కూడా “ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్” వెబ్ సిరీస్ కోసం చెంపలు వాచిపోయేలా కొట్టిన్చుకుందట. ఈ సినిమా గురించి ఆమె మాట్లాడుతూ “ఈ సినిమాలో నేను, నటుడు వికాస్ ఒకరినొకరం కొట్టుకోవాల్సిన సీన్ ఉంది. అయితే చాలా నాచురల్ గా రావాలని డైరెక్టర్ చెప్పారు.

అయితే మొదతలో నటుడు వికాస్ నన్ను పైపైన కొట్టినట్లు చేసాడు కానీ అందుకో అంతగా బాగా అనిపించలేదు. అందుకే మీమిద్దరం ఒక అండర్‌స్టాండింగ్‌కు వచ్చాం. ఇద్దరం కలిసి నిజంగానే చెంపలు కొట్టుకుందామని ఫిక్సయ్యాం. అప్పుడే ప్రేక్షకులకు నిజమైన ఫీలింగ్ వస్తుందనే ఉద్దేశ్యంతో.. చెంపలు వాచిపోయేలా కొట్టుకున్నాం. మా చెంపలు వాచిపోయాయి. దీంతో దర్శకుడు మా ఇద్దరి చెంపల తగ్గేవరకు షూటింగ్ ఆపి ఆ తర్వాతే మరో సీన్ షూట్ చేశారు’ అని నందినీ చెప్పుకొచ్చింది.
“ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్” సిరీస్‌లో నందినీ పల్లెటూరి పిల్లగా నటిస్తోంది. సినిమాల మీద మక్కువతో ఊరి నుంచి పట్నంకు వెళ్లిన అమ్మాయిలా ఆమె నటన ఆకట్టుకుంటోంది. శుక్రవారం రిలీజైన ఈ సిరీస్ ఆహాలో ప్రసారమవుతోంది.































