Nani : నాచురల్ స్టార్ నాని తనకంటూ ఒక స్టార్ డమ్ తెచ్చుకుని మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తో విభిన్న సినిమాలను తీస్తున్నారు. ఒక స్టార్ హీరో అనే టాగ్ లైన్ తో కంటే మన ఇంటి కుర్రాడు అనేలాగా తన సినిమాలు ఉండేలా నాని చూసుకుంటున్నాడు. కెరీర్ లో చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తున్న నాని ప్రస్తుతం మళయాళి భామ నజ్రియాతో కలిసి అంటే సుందరానికి అంటూ రాబోతున్నాడు. సినిమా విడుదల త్వరలో ఉండటంతో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న నాని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
పాన్ ఇండియా సినిమా అని మనం అనుకోవడం కాదు…..

ఇక పాన్ ఇండియా సినిమాలుగా తెలుగు సినిమా అటు బాలీవుడ్ లోనూ సత్తాచాటుతోంది. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా సినిమాల గురించి నాని కి ఒక ప్రశ్న ఎదురైంది. అసలే హిందీ జాతీయ భాష వివాదం కొనసాగుతుంటే ఇపుడు నాని చేసినా కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. పాన్ ఇండియా సినిమాపై ఆయన అభిప్రాయాన్ని అడుగగా, మనం సినిమాలు పాన్ ఇండియా కథలుగా ప్లాన్ చేసి పాన్ ఇండియా సినిమా అని అనుకుంటే సరిపోదు అది ప్రేక్షకులకు నచ్చాలి భాష బేధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చినపుడే అది పాన్ ఇండియా సినిమా అవుతుందని అభిప్రాయపడ్డారు.

దీనికి ఉదాహరణగా పుష్ప సినిమాను చెప్పారు. చిత్తూరు అడవుల్లో తెరకెక్కిన పుష్ప సినిమా బాలీవుడ్ జనాలకు నచ్చింది. కథా బలం ఉంది ప్రేక్షకులకు నచ్చితే ఏ భాష చిత్రాన్నైనా ఆదరిస్తారు అంటూ తనదైన శైలి లో అభిప్రాయపడ్డారు. ఇక నాని తాజా చిత్రం అంటే సుందరానికి సినిమా తరువాత దాసరా అనే సినిమాలో నటిస్తున్నారు. మాస్ ఎలిమెంట్స్ తో తెలంగాణ బొగ్గు గనుల్లో సాగే కథగా రూపొందుతోంది. ఈ సినిమాలో నాని లుక్ అటు ఇటు గా పుష్ప సినిమాలో బన్నీ లుక్ లా ఉండటం కొసమెరుపు.



























