Nani: నాచురల్ స్టార్ నాని తాజాగా నటించిన చిత్రం దసరా. ఈ సినిమా మార్చి 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాని హీరో రవితేజతో కలిసి చిట్ చాట్ చేశారు. ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా నాని తన సినీ కెరియర్లో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి తెలిపారు.

తాను నటనపై ఆసక్తితో ఎలాగైనా ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగాలని తన ఆల్బమ్ పట్టుకొని ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరగానని తెలిపారు. అయితే చాలామంది తనని ఆఫీస్ లోపలికి కూడా అడుగుపెట్టనివ్వలేదని నాని ఈ సందర్భంగా తెలిపారు. ఇకపోతే తాను అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో కొందరు దర్శకులు తనని డ్రైవర్ గా కూడా వాడుకున్నారని ఈయన తెలిపారు.
ఇలా తనని డ్రైవర్గా వాడుకోవడమే కాకుండా ఏదైనా పండుగప్పుడు బట్టలు కొనుక్కోవడానికి ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇస్తే వాటన్నింటినీ పోగుచేసుకొని దాచుకున్నాను చివరికి ఆ డబ్బులు కూడా లాక్కున్నారని నాని ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇలా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న నాని అవకాశాలు రాకపోవడంతో తాను నటుడిగా కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రయత్నాలు చేశానని తెలిపారు.

Nani:అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రయత్నాలు మొదలుపెట్టా…
ఇలా అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో తనకు ప్రముఖ దర్శకుడు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం వచ్చిందని ఇలా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తూనే తిరిగి హీరోగా కూడా అవకాశాలు అందుకున్నానని నాని తెలిపారు. అయితే ఈయన తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస సినిమా అవకాశాలను అందుకొని నటుడిగా ఎంతో మంచి గుర్తింపు పొందడమే కాకుండా నేడు ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. మరి దసరా సినిమా ద్వారా నాని ఎలాంటి గుర్తింపు పొందుతారో తెలియాల్సి ఉంది.






























