Nara Chandhrababu Naidu : ఏపీ రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు కామన్. అయితే తాజాగా ప్రభుత్వ ప్రతిక్షాల మధ్య ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నలిగి పోతున్నారు. వైసీపీ విమర్శలకు సోషల్ మీడియా ట్రోల్స్ కి బలవుతున్నారు. రాజు పెద్ధ భార్య మంచిది అంటే చిన్న భార్య గయ్యాళి అన్నట్లుగా చంద్రబాబు డెవలప్మెంట్ చేసాడు ఆన్నందుకు రజనీకాంత్ మీద వైసీపీ నేతల దాడి మొదలయింది. ఇక ఈ విషయం గురించి చంద్రబాబు మీడియా ముందు వైసీపీ ని విమర్శించారు.

రజనీకాంత్ ఏం తప్పు చేసాడు…
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు వచ్చిన రజనీకాంత్ గారు ఆ వేడుకల్లో మాట్లాడుతూ ఎన్టీఆర్ గారి గొప్పతనం వివరించారు. ఆయనే తాను సినిమాల్లోకి రావడానికి ఇన్స్పిరేషన్ అంటూ చెప్పారు. సినిమాల్లో చేస్తున్న తొలినాళ్ళలో తనకు ఎంతో గైడన్స్ ఇచ్చారంటూ చెప్పారు. ఇక అంతే కాకుండా హైదరాబాద్ లో హైటెక్ సిటీ చూసి ఎక్కడో న్యూయర్క్ లాంటి నగరంలో ఉన్నాననిపించింది. చాలా బాగా చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చేసారని చెప్పారు రజనీకాంత్.

ఇక వైసీపీ వాళ్ళు అప్పటి నుండి ఆయనను ట్రోల్ చేయడం, రోజా వంటి నేతలు విమర్శించడం మొదలు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రజనీకాంత్ ఏం చేసాడు మీకు, మీ ప్రభుత్వాన్ని ఏమైనా విమర్శించాడా, లేక మీ నాయకుడిని ఏదైనా అన్నాడా, అయినా ఆయనను ఎందుకు టార్గెట్ చేసారు. ఆయన ఇంటర్నేషనల్ హీరో, విదేశాల్లో కూడా మార్కెట్ ఉన్న మొదటి హీరో, అలాంటి వ్యక్తిని విమర్శిస్తున్నారు. మిమ్మల్ని చూసి పక్క రాష్ట్రాల వాళ్ళు ఛీ కొడతారు. ఆయన ఎన్టీఆర్ గారి గొప్పతనం చెప్పారు. అలాగే హైదరాబాద్ ను అభివృద్ధి చేసానని నా గురించి చెప్పారు. అందుకు మీకెందుకు అంత ఉలుకు అంటూ విమర్శించారు.





























