Naresh : ఇపుడు సోషల్ మీడియాలో రోజు హాట్ న్యూస్ నరేష్, పవిత్ర లోకేష్ గురించే. వీళ్ళ మధ్య నిజంగా ఏముందో తెలియదు కానీ ఒక పూట వాళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారని అంటే మరో పూట సహజీవనం చేస్తున్నారంటు వార్తలు. ఇక త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ మరో న్యూస్ ఇలా వీళ్ళ గురించి చిన్నదో పెద్దదో ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతోంది. ఇక జనాలకు కూడా వీళ్ళ మ్యాటర్ లో బాగా ఇంట్రస్ట్ పెరిగింది. వీళ్ళ మ్యాటర్ లో ఏ చిన్న అప్ డేట్ ను మిస్ అవ్వడం లేదు. అయితే నరేష్ భార్య రమ్య నాకు నరేష్ కావాలి విడాకులు తీసుకోలేదనడం, ఇక పవిత్ర మాకు సపోర్ట్ చేయండి అంటూ అనడం ఇవన్నీ ఓ వైపు జరుగుతుంటే జనాలు మాత్రం అసలు నరేష్ ఇన్ని పెళ్లిళ్లు చేసుకోడానికి కారణం ఏమిటి ఎంత ఆస్తిపాస్తులు నరేష్ కి ఉన్నాయి అనే ఆరాలు మొదలుపెట్టారు.

కాస్ట్లీ కార్లు, ఫామ్ హౌజ్ లు, వందల కోట్లు….
నరేష్ తల్లి విజయనిర్మల అలనాటి హీరోయిన్ అలాగే డైరెక్టర్ గాను చాలా సినిమాలు చేసారు. ఇక ప్రొడ్యూసర్ గా కూడా సినిమాలు నిర్మించారు. ఆమె తన మొదటి భర్తతో విడిపోయి కృష్ణ గారిని పెళ్లి చేసుకున్నప్పటి నుండి నరేష్ కృష్ణ గారితోనే ఉన్నారు. ఇక విజయనిర్మల గారి ఆస్తులన్నీ కొడుక్కి ఇచ్చారు. ఇక నరేష్ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలై హీరోగా చాలా సినిమాలు చేసారు ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యారు. ఒక్కో సినిమాకు 40 నుండి 50 లక్షల దాకా రెమ్యూనరేషన్ తీసుకుంటారని టాక్ సినిమాల డేట్స్ బట్టి రెమ్యూనరేషన్ ఉంటుందట .

ఇక ఆయన ఆస్తుల విషయానికి వస్తే చెన్నై లోనూ, హైదరాబాద్ లోనూ ఫామ్ హౌజ్ లు, బంగ్లాలు ఉన్నాయి. ఇక ఆయనకు ఐదు కాస్ట్లీ కార్లు ఉన్నట్లు సమాచారం, ఇక రీసెంట్ గా మరో కాస్ట్లీ స్పోర్ట్స్ కారును కొనుగోలు చేశారట. ఇక ఆయన షూటింగుల కోసం క్యారవాన్ దాదాపు ఐదు కోట్లు చేస్తుందట. ముంబై నుండి ప్రత్యేకంగా తెప్పించుకున్నారట. ఇక ఇలా మొత్తంగా చూసుకుంటే నరేష్ కి దాదాపు రెండోదల కోట్ల ఆస్తులు ఉన్నట్లు సమాచారం.































