Naresh : గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న వార్త సీనియర్ నటుడు నరేష్, అలాగే సీనియర్ నటి పవిత్ర లోకేష్ ల ప్రేమ ముచ్చట గురించి. ఇప్పుడు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకంటే ఆశ్చర్యకరమైన విషయం నరేష్ ఇప్పటికే ఒకటీ, రెండు కాదు మూడు పెళ్లిళ్లు చేసుకుని వారికి విడాకులు ఇచ్చి మళ్ళీ బ్యాచిలర్ అయ్యాడు. ఇక పవిత్ర లోకేష్ కూడా కన్నడ పరిశ్రమకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుని విడిపోయింది. అలా ఆయనకు నాలుగోది, ఈవిడకు రెండోది అన్నట్టుగా వీరి పెళ్లి గురించి మాట్లాడుతున్నారు.

పెళ్లి గురించి ఎమోషనల్ అయిన నరేష్…
ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పెళ్లిళ్ల గురించి స్పందించారు నరేష్. సినిమా వాళ్ళు ఎందుకని ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటారని అడుగగా సినిమా వాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి కనిపిస్తాయి, బయటి వాళ్ళవి కనిపించవు అంతే అంటూ కామెంట్ చేసారు. ఇప్పటి పరిస్థితులలో అసలు వివాహ వ్యవస్తే తప్పని, ఎందుకంటే ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నా, ఆ తరువాత నెల రోజులకే వీడిపోవాలని అనుకుంటున్నారు. భార్య, భర్త ఇద్దరు సమంగా ఉండటం, ఇద్దరు స్వేచ్ఛను కోరుకోవడం కారణాలు అంటూ చెప్పారు.

ఇక సినిమా ఇండస్ట్రీ లో ఉన్న వారికి వృత్తి జీవితంకి అసలు సమయపాలన ఉండదు, నేను నెలలో 28 రోజులు పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటి సమయంలో నా వృత్తి జీవితాన్ని అర్థం చేసుకునే వారే నా జీవితంలో ఉంటారు. అర్థం చేసుకోని వారు ఉండరు అంతే అంటూ వాఖ్యణించారు. అన్ని గంటలు ఎందుకు పనిచేస్తారు అని అడుగగా, నాకు సినిమాలంటే పిచ్చి, నా మొదటి భార్య సినిమానే అంటూ చెప్పారు. నా సినిమా కోసం నేను ఏమైనా చేస్తా మొదట ప్రాముఖ్యత నాకు సినిమానే మిగిలినవన్నీ ఆ తరువాతే అంటూ చెప్పారు.































