Naresh-Ramya-Pavithra Lokesh : ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నరేష్ పవిత్ర లోకేష్ ల రిలేషన్ కి సంబంధించిన వార్తలు హాట్ టాపిక్ గా వున్నాయి. నరేష్ పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకుంటున్నారు అన్న వార్తలు రావడం, తరువాత నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి ఎంట్రీ ఇవ్వడం, నరేష్ గురించి పవిత్ర లోకేష్ గురించి షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రోజూ వీరి గురించే పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి.

నా ఫ్యామిలీని చక్క పెట్టుకోవడానికి నేను సిద్ధంగా వున్నాను…
నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి, నరేష్-పవిత్ర గురించి చేసిన షాకింగ్ కామెంట్లు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి. మా పెళ్లి జరిగిన తర్వాతనే నాకు తెలిసింది నరేష్ కు మహిళలతో సంబంధాలు ఉన్నాయని. అంతకుముందే ఈ విషయాల గురించి మా అత్తగారు విజయనిర్మల గారికి కూడా తెలుసు. అయితే ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు అవన్నీ కేవలం రూమర్లు మాత్రమేనని, నరేష్ నన్ను క్షమించమని అడిగేవారు. ఈ విధంగా మా ఇద్దరి మధ్య జరిగే గొడవలన్నీంటి గురించి విజయనిర్మల గారికి తెలుసు. అప్పట్లో నేను ఇంటి నుంచి వెళ్ళిపోతాను అంటే వెళ్లకూడదని మా అత్తగారు మాట కూడా తీసుకున్నారని రమ్య తెలిపారు. కేవలం తన కొడుకు కోసమే ఇలాంటి వాటిని ఇన్నిరోజులు భరిస్తూ వచ్చానని రమ్య వెల్లడించారు.

నరేష్ పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకోబోతున్నారని కేవలం వార్తలు మాత్రమే వచ్చాయి అయితే వారి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన ఇంతవరకూ రాలేదని రమ్య వెల్లడించారు. తన భర్తతో తనకు విడాకులు ఇంకా అధికారకంగా రాలేదని విడాకులు రాకుండానే నరేష్ మరో పెళ్లి ఎలా చేసుకుంటారు అని రమ్య ప్రశ్నించారు. అంతేకాకుండా ఎప్పుడైతే పవిత్ర లోకేష్ పెళ్లి వార్తలు వచ్చాయో అప్పుడే నరేష్ నాకు కోర్టు నుంచి విడాకులు నోటీసులు కూడా పంపించారని, తనని నరేష్ విడాకులపై సంతకం పెట్టాలంటూ గన్ తో బెదిరించారని రమ్య రఘుపతి షాకింగ్ కామెంట్ చేశారు. ప్రస్తుతం నాకు నా భర్త నుంచి విడాకులు తీసుకోవడానికి ఇష్టం లేదని, తిరిగి నా ఫ్యామిలీని నేను చక్కపెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం రమ్య రఘుపతి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



























