Natti Kumar : ప్రముఖ నిర్మాత, తెలుగు సినిమా నిర్మాత మండలి లో పనిచేసిన నట్టి కుమార్ సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం జరుగుతున్న విషయాలమీద ఆసక్తికర వాఖ్యలు చేసారు. ప్రస్తుతం సినిమా నిర్మాణ మండలి సినిమా షూటింగుల బంద్ కు పిలుపునిచ్చింది. సినిమా వ్యయం పెరగడం, అంతర్గత సమస్యలు, హీరోల పారితోషికాలు ఎక్కువగా ఉండడం, ఓటీటీ ప్లాట్ ఫామ్ లో సినిమాలు రావడం వంటివి నిర్మాతలను ఇబ్బందిపెడుతున్నాయి. ఇక ఈవిషయం లో నిర్మాత గిల్డ్ చర్చలు జరుపుతోంది. అయితే తాజాగా నట్టి కుమార్ ఈ విషయాలపై మాట్లాడారు.

సినిమా షూటింగ్ ఎందుకు బంద్ చేయాలి…
సినిమా వ్యయం పెరగడం వల్ల నిర్మాతలకు నష్టం జరుగుతున్న మాట వాస్తవమే. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. సినిమా టికెట్ రేట్లు పెరగడం వల్ల థియేటర్లకు ప్రేక్షకులు రావడం తగ్గిపోయింది. ఓటీటీ ప్లాట్ ఫామ్ మీద చాలా మంది ప్రేక్షకులు ఆధారపడుతున్నారు. ఇక హీరోల శృతిమించిన రెమ్యూనరేషన్లు, అలాగే ఓటీటీ లో సినిమాలు వెంటనే వచ్చేయడం వల్ల నిర్మాతకు నష్టాలు వస్తున్నాయి. అయితే వీటిని పరిష్కరించుకుంటే సరిపోతుంది. దానికి షూటింగులు నిలిపివేయడం సరైన పని కాదు అంటూ చెప్పారు. ఇక పెద్ద హీరోలు తమ రెమ్యూనరేషన్ తగ్గించుకోడానికి సిద్ధమయ్యారు. ఇక టికెట్ రేట్ల విషయంలో నిర్ణయం తీసుకుంటే ప్రేక్షకులు థియేటర్ కి వస్తారు అంటూ చెప్పారు నట్టి కుమార్.
మాచర్ల నియోజకవర్గం విడుదల…

ఇక మాచర్ల నియోజకవర్గం సినిమా విడుదల పై కూడా క్లారిటీ ఇచ్చారు. సినిమా విడుదల అవుతుందని, ఒక ఫేక్ ట్వీట్ వల్ల సినిమా ను ఒక కులానికి ఆపాదించడం సబబు కాదని అన్నారు నట్టి కుమార్. హీరో నితిన్ కానీ అతని తండ్రి సుధాకర్ రెడ్డి కానీ ఒక కులానికి ప్రాధన్యత ఎప్పుడు ఇవ్వలేదని, సినిమా వాళ్లకు కులం లేదని కేవలం మాది సినిమా కులం అంటూ చెప్పారు నట్టి కుమార్. సినిమా విషయంలో అపోహలు వద్దని చెప్పారు. చిన్న రూమర్ అయిన స్పందించక పోతే నిజం అనుకునే ప్రమాదం ఉంది అందుకే వెంటనే నితిన్ స్పందించాడని చెప్పారు నట్టి కుమార్.



























