Natti Kumar : ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు చిరంజీవి గారి కొత్త సినిమా ‘గాడ్ ఫాదర్’ సందర్బంగా చిరంజీవి గారు మాట్లాడుతూ గాడ్ ఫాదర్ సినిమా థియేటర్ కి వచ్చి సినిమాను చూడండి బాగుంటేనే ఆదరించండి అంటూ మాట్లాడటం గురించి నట్టి కుమార్ వాఖ్యణించారు. చిరంజీవి గారు ఆచార్య సినిమా ఫలితం తరువాత భయపడుతున్నారు, అంటూ అందరూ కామెంట్స్ చేయడం గురించి నట్టి మాట్లాడారు.

గాడ్ ఫాదర్ మంచి హిట్ అవుతుంది…
చిరంజీవి గారు ఏమాత్రం భయపడటం లేదు కేవలం సినిమాను థియేటర్ లో చూద్దామని ప్రేక్షకులను కోరారు. అందులో నాకేమి తప్పు కనిపించడం లేదు ఎవరైనా సరే సినిమా విడుదల అవుతోందంటే సినిమాను చూడండి అని చెప్పడంలో తప్పేముంది అంటూ నట్టి కుమార్ వాఖ్యణించారు. ఇక రీమేక్ లుగా వచ్చిన ఎన్నో చిరంజీవి సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. గాడ్ ఫాదర్ సినిమా కూడా ఖచ్చితంగా హిట్ అవుతుంది అంటూ చెప్పారు.

ఆచార్య సినిమా ఫ్లాప్ అవడానికి కారణాలను కూడా వివరించారు నట్టికుమార్. ఆచార్య సినిమా రిలీజ్ డేట్ ముందు ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల తేదీ రోజున రావాలి. అలా వచ్చుంటే సినిమా ఫలితం ఇంకోలా ఉండేది. కానీ ఆ సినిమాకు అడ్డురాకూడదనే ఉదేశంతో ఆచార్య యూనిట్ డేట్ ను మార్చుకున్నారు. ఇక సినిమా నెలాఖరున విడుదల చేయడం, అందునా పదవతరగతి పరీక్షలు ఇలాంటివన్నీ సినిమా చూడకపోదసనికి కారణాలు అంటూ నట్టి కుమార్ అభిప్రాయపడ్డారు. చిరంజీవి గారి సినిమా ఫలితం గురించి భయపడాల్సిన పని లేదు. ఆయన రేంజ్ వేరు ఒక సినిమా పోతే అవకాశాలు పోతాయనుకునే రేంజ్ హీరో కాదు ఆయన అంటూ చెప్పారు నట్టి కుమార్.































