Natti Kumar Intresting comments : విశ్వక్ సేన్ తన సినిమా అశోక వనం లో అర్జున కళ్యాణం ప్రమోషన్ కోసం చేసిన ప్రాంక్ వీడియో రేపిన దుమారం ఇంకా తగ్గలేదు. ఆ ప్రాంక్ వీడియో పై కొంతమంది అభ్యంతరం తెలుపడం తో టి వి 9 స్టూడియో కి డిబేట్ కి వెళ్లడం అక్కడ యాంకర్ దేవి నాగవల్లి తో వివాదం అందరికీ తెలిసిందే. అయితే మొదట ఈ వివాదం లో మొదట విశ్వక్ సేన్ కు అంతగా మద్దతు లభించలేదు. దేవి నాగవల్లి కి మహిళా సంఘాల నుంచి జర్నలిస్టు సంఘాలు మొదటి నుంచి మద్దతు ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం విశ్వక్ సేన్ కు సోషల్ మీడియా నుంచి మద్దతు లభిస్తోంది. విశ్వక్ గురించి మొదట ఇండస్ట్రీ వాళ్ళు కల్పించుకొక పోయిన ఇపుడు వాళ్లు కూడా మద్దతు తెలుపుతున్నారు. అంతేకాకుండా అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా చూడాలి అని చెబుతూ ఇండైరెక్ట్ గా మద్దతు తెలుపుతున్నారు. అయితే ఇండస్ట్రీ వాళ్ళంతా విశ్వక్ సేన్ కు మద్దతు తెలుపుతుంటే, ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాత నట్టికుమార్ మాత్రం అందరికీ విరుద్ధంగా దేవీ నాగావల్లి కి తన మద్దతు ప్రకటించారు అంతేకాకుండా ఈ విషయం పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

నిర్మాత నట్టి కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు…
విశ్వక్ సేన్ దేవి నాగవల్లి వివాదం గురించి మాట్లాడిన నటి కుమార్ తన మద్దతు దేవీ నాగవల్లి కే అని చెప్పకనే చెప్పారు.ఎంత కోపం వచ్చిన విశ్వక్ ఒక ఆడపిల్లని అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎలాంటి సందర్బం అయిన ఆడపిల్ల గురించి అలాంటి పదాలు మాట్లాడకూడదు.’ అంటూ నట్టి కుమార్ కామెంట్ చేశారు. విశ్వక్ చేసింది తప్పు అని మీరు భావించినప్పుడు అతని వీడియోలను ఆపేయాలి. అతని సినిమా ప్రమోషన్స్ మీ ఛానల్ లో చూపించకూడదు. కానీ, మీ ఛానల్ లో సినిమా ప్రమోషన్స్ వస్తున్నాయి.
మొత్తానికి విశ్వక్ సేన్ అనుకున్నది సాధించాడు. ప్రాంక్ వీడియో చేసి తన సినిమాకి భారీగా పబ్లిసిటీ తెచ్చుకోవాలి అనుకున్నాడు. టీవీ ఛానల్, మీడియా వాళ్లు ఆ వివాదాన్ని వైరల్ చేసి, వీడియోలు చేసి సినిమా కావాల్సిన బోలెడంత ఖర్చు లేకుండా పబ్లిసిటీ కల్పించారు. విశ్వక్ ఏదైతే కోరుకున్నాడో అది జరిగిపోయింది. కానీ, యాంకర్ దేవీ నాగవల్లికి మాత్రం న్యాయం జరగలేదు.అని నట్టి కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.































