Naughty Naresh : జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలా ఏదైనా అందరినీ కడుపుబ్బ నవ్విస్తూ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు జబర్దస్త్ కమెడియన్స్. కానీ వాళ్ళు మనల్ని నవ్వించడానికి చాలా కష్టపడుతారు అలాగే వాళ్ల జీవితంలోని కష్టాలను కనిపించనికుండా మనల్ని నవ్విస్తారు. ఒక్కసారి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళితే వాళ్ళ కష్టాలు, వాళ్ళు దగా పడిన సందర్భాలు మనకు కన్నీళ్లు తెప్పిస్తాయి. ఈవెంట్ ఏదైనా తన పంచులతో మనల్ని నవ్వించే నాటీ నరేష్ నిజ జీవితంలో ప్రేమ విఫలమైందని ఇంత వరకు ఎవరికీ తెలియదు.

శ్రీ దేవి డ్రామా కంపెనీ లో డాన్స్ చేసి మరీ బ్రేక్ అప్ స్టోరీ…
ఇక ప్రతి వారం ఒక కాన్సెప్ట్ తో వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు ఈ సారి రాను రానంటూనే చిన్నదో అనే కాన్సెప్ట్ తో ఈ వారం ఈవెంట్ చేయబోతున్నారు. ఇక ఈ ఈవెంట్ కి హీరోయిన్ సదా అతిధి గా వచ్చి అలరించింది. ఇక ఈ ఎపిసోడ్ ప్రోమోలో నాటీ నరేష్ ‘జన్మ నీకేలే’ అంటూ ప్రేమిస్తే సినిమాలోని పాటకు డాన్స్ చేసాడు. చాలా బాధగా భావోద్వేగంగా చేసిన డాన్స్ తో అందరినీ ఏడిపించేసాడు. ఇక గెస్ట్ గా వచ్చిన సదా నిజంగా బ్రేకప్ జరిగిందా అంటూ నరేష్ ని అడుగగా నిజ జీవితంలో జరిగిన ఇష్యూ నే డాన్స్ లో చూపించానని చెప్పాడు.

ఇక నరేష్ ఈవెంట్స్ ద్వారా ఒక అమ్మాయి పరిచయం అవ్వగా ఆ అమ్మాయి నిజంగా తనని ప్రేమించిందని అనుకున్నాడట. కొంత కాలం రిలేషన్ లో కూడా ఉన్నారట కానీ ఆ అమ్మాయి డబ్బు కోసం మాత్రమే ప్రేమించిందని తాను మోసపోయాడని తరువాత అర్థమైందట. ఇక ఇదంతా పాటలో డాన్స్ చేస్తూ అందరినీ ఎమోషనల్ చేసాడు నరేష్. అయితే ఇది నిజామా లేకపోతే టీఆర్పి కోసం చేశారా అన్నది ఎపిసోడ్ చూస్తే కానీ తెలియదు.































