Navadeep: తెలుగు సినీ ప్రేక్షకులకు హీరో నవదీప్ గురించి పరిచయం అవసరం లేదు ఈయన ఎన్నో సినిమాలలో హీరోగా నటించే ప్రేక్షకులను మెప్పించారు. అనంతరం విలన్ పాత్రలలో అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నవదీప్ నటించిన సందడి చేశారు. ప్రస్తుతం ఈయన సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్నారు.

చివరిగా నవదీప్ న్యూసెన్స్ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈయన ప్రమాదానికి గురయ్యారని ఈ ప్రమాదంలో తన కాలికి తీవ్రమైన గాయం తగలడంతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని తెలుస్తోంది.ఇలా నవదీప్ ప్రమాదానికి గురయ్యారన్న విషయాన్ని బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి మదివాడ బయట పెట్టారు.
నవదీప్ తేజస్వి వీరంతా కూడా ఎంతో మంచి స్నేహితులు దీంతో ఈయనకు కాలు విరిగిందనే విషయం తెలియడంతో పరామర్శించడానికి వెళ్లినటువంటి ఈమె అక్కడ నవదీప్ తో కలిసి పన్నీ రీల్ చేశారు. దీంతో ఈయన ప్రమాదానికి గురయ్యారన్న విషయం బయటపడింది కానీ ఎలా ప్రమాదానికి గురయ్యారనే విషయాన్ని మాత్రం తెలియజేయకపోవడంతో అభిమానులు కంగారుపడుతూ ఏం జరిగింది అంటూ కామెంట్లో చేస్తున్నారు.

Navadeep:త్వరగా కోలుకోవాలంటున్న ఫ్యాన్స్…
ఇకపోతే ఈమె నవదీప్ దగ్గరకు వెళ్లి అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి అంటూ రీల్ చేశారు. అయితే గతంలో తేజస్వి కూడా ఇలా ప్రమాదానికి గురి కావడంతో నవదీప్ ఇలాగే చేయడంతో ఈమె నేడు రివెంజ్ తీర్చుకుంటూ చేసినటువంటి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో నవదీప్ చాలా డల్ గా కూర్చుని కనిపించడంతో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.





























