Navadeep: నావల్ల ఏ హీరోయిన్ చనిపోలేదు..నేను గే కాదు నవదీప్ కామెంట్స్ వైరల్!

0
192

Navadeep: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నవదీప్ గురించి పరిచయం అవసరం లేదు. అయితే తాజాగా ఈయన న్యూసెన్స్ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ వెబ్ సిరీస్ మే 12వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నవదీప్ గతంలో తన గురించి వచ్చినటువంటి వార్తలు అన్నింటికీ క్లారిటీ ఇచ్చారు. 2005వ సంవత్సరంలో హీరో నవదీప్ కారణంగా ఓ హీరోయిన్ చనిపోయింది అంటూ పత్రికలలో వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలపై తాజాగా నవదీప్ స్పందించారు.

తన వల్ల ఏ హీరోయిన్ చనిపోలేదని అవన్నీ కేవలం అవాస్తవాలని కొట్టి పారేశారు. అలాగే నేను గే అనీ కూడా వార్తలు రాశారు. ఈ విషయాన్ని కూడా నవదీప్ ఖండించారు. ఇక తాను రేవ్ పార్టీలో భాగంగా అధికారులకు దొరికిపోయాను అంటూ కూడా వార్తలు వచ్చాయి. నిజానికి నేను ఆ రోజు ఫ్యామిలీతో కలిసి ఫ్యామిలీ గెస్ట్ హౌస్ లో ఉన్నామని తెలియజేశారు.

Navadeep: నేను నా ఫ్యామిలీతో ఉన్నాను….

ఇలా నా గురించి అన్ని తప్పుడు వార్తలు మాత్రమే వచ్చాయని, ఆరోజు నేను నా ఫ్యామిలీతో ఉండటం వల్ల నా ఫ్యామిలీ నాపై మరింత నమ్మకాన్ని పెంచుకున్నారని నవదీప్ తెలిపారు. ఇక మీడియా తన గురించి ఇలాంటి వార్తలు రాసిన నేపథ్యంలో తాను కక్ష సాధింపు చర్యగా ఈ వెబ్ సిరీస్ లో నటించలేదని తెలియజేశారు. ఇక ఈ సిరీస్ లో నవదీప్ జోడిగా బిందు మాధవి నటించిన సంగతి తెలిసిందే.